Arthritis: ఈ 3 పండ్లు కీళ్లనొప్పులని తగ్గిస్తాయి.. తప్పకుండా తినండి..!

These 3 Fruits Reduce Arthritis be Sure to eat
x

Arthritis: ఈ 3 పండ్లు కీళ్లనొప్పులని తగ్గిస్తాయి.. తప్పకుండా తినండి..!

Highlights

Arthritis: నేటి కాలంలో కీళ్ల నొప్పుల సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. 30 ఏళ్లు దాటితే చాలు కీళ్ల నొప్పులు ప్రారంభమవుతున్నాయి.

Arthritis: నేటి కాలంలో కీళ్ల నొప్పుల సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. 30 ఏళ్లు దాటితే చాలు కీళ్ల నొప్పులు ప్రారంభమవుతున్నాయి. ఈ పరిస్థితిలో వాటిని ఎదుర్కోవటానికి ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. లేకుంటే ఈ సమస్య తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలామంది చాలా చిట్కాలు పాటిస్తున్నారు. కానీ ఎటువంటి ఫలితాలు ఉండటం లేదు. కానీ ఆహారంలో ఈ మూడు పండ్లను చేర్చుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. కాబట్టి ఆ పండ్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1. నారింజ

మీ ఆహారంలో నారింజను తప్పకుండా చేర్చుకోండి. వీటిని తినడం వల్ల శరీరంలో నీటి కొరత తీరుతుంది. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్లనొప్పులని తగ్గించడంలో సహాయపడుతుంది.

2. ద్రాక్ష

ద్రాక్ష పండ్లను తీసుకోవడం ద్వారా మీరు అనేక రకాల వ్యాధుల నుంచి రక్షింపబడుతారు. కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ద్రాక్షను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. ముఖ్యంగా పిల్లలకి ఎక్కువగా తినిపించాలి.

3. పుచ్చకాయ

ఇది వేసవి కాలం ఈ సమయంలో పుచ్చకాయ తినడం అన్ని విధాల శ్రేయస్కరం. దీని వల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. తక్షణ శక్తి లభిస్తుంది. దీనిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ఎండాకాలం బయటికి వెళ్లే ముందు లేదా బయటి నుంచి వచ్చిన తర్వాత పుచ్చకాయ తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు కీళ్ల నొప్పులని కూడా తగ్గిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories