Digestive System: జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉండాలంటే ఈ 3 ఆహారాలు తప్పనిసరి..

These 3 Foods are Essential for Proper Digestive System
x

జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉండాలంటే ఈ 3 ఆహారాలు తప్పనిసరి(ఫైల్ ఫోటో)

Highlights

* ఈ మూడు ఆహారాలను తీసుకుంటే జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది.

Digestive System: భోజన ప్రియులకు అడ్డు అదుపు ఉండదు. ఇష్టారీతిన తింటూ ఉంటారు. తర్వాత బాధపడుతారు. ఎందుకంటే కొంతమందికి జీర్ణవ్యవస్థ సరిగ్గా ఉండదు. దీంతో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వివాహాలు కానీ ఏదైనా ఫంక్షన్లు జరిగినప్పుడు ఆహార ప్రియులు అదుపులో ఉండరు. అలాంటి సమయంలో అతిగా తిన్న తర్వాత ఈ మూడు ఆహారాలను తీసుకుంటే జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. మెంతి గింజల లడ్డు

మెంతి గింజలు, బెల్లం, నెయ్యి, పొడి అల్లంతో తయారు చేసిన లడ్డు తింటే ఈ సమస్య ఉండదు. ఇది తిమ్మిరి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. పేగు శ్లేష్మ పొరను పెంచుతుంది జుట్టును మెరిసేలా చేస్తుంది. భోజనం తర్వాత దీనిని సాయంత్రం 4-6 గంటలకు తీసుకోవాలని సూచించారు.

2. మజ్జిగ

భోజనం చేసిన వెంటనే మిరియాలు, బ్లాక్ సాల్ట్ కలిపిన ఒక గ్లాసు మజ్జిగ తాగాలి. ఇది జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. మజ్జిగ ప్రోబయోటిక్స్, విటమిన్ B12 రెండింటికీ మంచి మూలం. ఇది ఉబ్బరం, గ్యాస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. సాయంత్రం ఈవెంట్‌లకు హాజరై, మసాల ఆహారాలు తింటే ఒక్క గ్లాసు మజ్జిగ తాగడం మరిచిపోకండి.

3. చ్యవనప్రాష్

నిద్రవేళలో ఒక చెంచా చ్యవన్‌ప్రాష్ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది. ఇది ఫ్లేవనాయిడ్‌లు, యాంటీఆక్సిడెంట్‌ల మూలం. చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. మీరు డెస్టినేషన్ వెడ్డింగ్‌ కానీ రాత్రిపూట వేడుకలు కానీ కలిగి ఉంటే చ్యవన్‌ప్రాష్‌ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories