వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాలు

వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాలు
x
Highlights

తుమ్ము, జలుబు , దగ్గు వచ్చిందా.. అయితే మరుక్షణం ఆలోచించకుండా డాక్టర్ల వద్దకు పరుగులు పెట్టే రోజులివి... చిన్నపాటి కాలినొప్పికైనా, తలపోటు వచ్చినా మందు...

తుమ్ము, జలుబు , దగ్గు వచ్చిందా.. అయితే మరుక్షణం ఆలోచించకుండా డాక్టర్ల వద్దకు పరుగులు పెట్టే రోజులివి... చిన్నపాటి కాలినొప్పికైనా, తలపోటు వచ్చినా మందు బిల్లలు మింగాల్సిందే... ఇదే ట్రెండ్ ఇప్పుడు ఫాలో అవుతున్నారు ప్రజలు.. నిజమే అసలు మనల్ని ఈ సమస్యలు ఎందుకు వెంటాడుతున్నాయి... దీనికి గల కారణాలేంటని ఏ ఒక్కరు కూడా ఆలోచించరు.. ఒకప్పుడు ఎంతో ధృడంగా, శక్తివంతంగా మన పెద్దలు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపారు అదెనండోయ్... వైద్యం జోలికి వెల్లని రోజులు కూడా ఉన్నాయి.. కానీ ఆ పరిస్థితి నేడు తారుమారయ్యింది.

చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరిలో వ్యాధినిరోధక శక్తి రోజు రోజుకు క్షీణించిపోతోంది... శరీరం పలు రోగాల పాలవ్వడానికి ఇదే కారణం అంటున్నారు వైద్యులు.

మరి మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఎందుకు తగ్గుతుందో దాని కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం... ఆహారం, పోషకాల విషయం పక్కన పెడితే... మన శరీరంలో నీటి శాతం తగ్గినా... ఆక్సీజన్ లెవల్స్ తగ్గినా...సమయానికి పడుకోకపోయినా శరీరంలో రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. కంటికి సరపడా నిద్రపోకుండా ఎంత పోషకాహారం తీసుకున్నా లాభం ఉండదు...

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రోబయోటిక్స్ ఆహారాలు, విటమిన్ ఇ, విటమిన్ ఎ , విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు, జింక్ కలిగిన పదార్ధాలు , సెలీనియం అధికంగా ఉండే పదార్ధాలను తీసుకుంటూ ఉండాలి. మరి ఈ పోషకాలు ఏఏ ఆహారంలో ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే తృణధాన్యాలను తీసుకోవడం వల్ల మన శరీరం లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పాలు, పెరుగు, జున్ను వంటి పాల పదార్ధాలు మంచి ఫలితాన్ని అందిస్తాయి. ముఖ్యంగా రోజు ఒక కప్పు పెరుగును తీసుకోవడం వల్ల అనేక రోగాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

విటమిన్ ఇ అధికంగా ఉండే బాదం పప్పు, వేరుశనగగుళ్లు, పొద్దుతిరుగుడు విత్తనాలను తీసుకుంటూ ఉండాలి. విటమిన్ డి రెసిస్టెన్స్ పవర్ ను పెంచేందుకు సహకరిస్తుంది. ముఖ్యంగా ఉదయం పూట వచ్చే ఎండలో కాసేపు సమయం గడిపితే శరీరాన్ని ఎంతో శక్తివంతంగా మార్చుకోవచ్చు. సాల్మన్ చేపను తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి శక్తిని అందించవచ్చు.

ఇక కూరగాయలు పండ్ల వాషయానికి వస్తే... క్యారెట్లు, పసుపు, ఎరుపు మరియు పచ్చ క్యాప్సికమ్‌, మష్రూమ్స్ , బ్రకోలిని, బీన్స్, బఠానీలు తరచుగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం దక్కుతుంది. ఆకుకూరల్లో పాలకూర అధికంగా తీసుకుంటే మంచి శక్తి లభిస్తుంది. పండ్లలో అరటి పండ్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి.

ఇక మాంసాహారం విషయానికి వస్తే.. ట్యూనా ఫిష్, రొయ్యలు, టర్కీ చికెన్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మన శరీరంలో పెరుగుతుంది.

పైన తెలిపిన ఆహారాన్ని క్రమం తప్పకుండా మితి మీరకుండా శరీరానికి అందించడం వల్ల పోషకాహార లోపాన్ని తరిమికొట్టడంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా రోగాలను తరిమికొట్టే శక్తి లభిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories