స్మార్ట్‌ఫోన్‌ పట్టుకునే పద్దతి మీ వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది.. ఎలాగో తెలుసుకోండి..!

Smartphone: జీవితంలో ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది.

Arun Chilukuri
Updated on: 10 Feb 2023 1:01 PM IST
The way you Hold Your Smartphone Defines Your Personality Learn How
X

స్మార్ట్‌ఫోన్‌ పట్టుకునే పద్దతి మీ వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది.. ఎలాగో తెలుసుకోండి..!

Smartphone: జీవితంలో ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. తినడం, నడవడం, పని చేయడం, మాట్లాడటం అన్ని వేర్వేరుగా ఉంటాయి. అయితే స్మార్ట్‌ఫోన్‌ పట్టుకునే పద్దతి ద్వారా కూడా ఒకరి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవచ్చు. ఇది మనస్తత్వశాస్త్రంలో వివరంగా ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఒక చేత్తో మొబైల్ పట్టుకుని మరో చేతివేలితో స్క్రోల్ చేసే వారు ఆలోచనాపరులు. వ్యక్తిగత జీవితంలో కాస్త సిగ్గుపడతారు. ఏకాంతంలో ఉండటానికి ఇష్టపడతారు. అతని ఊహలు చాలా భిన్నంగా ఉంటాయి. కెరీర్‌ విషయంలో విజయం సాధిస్తారు. అలాగే కొంతమంది వ్యక్తులు ఫోన్‌ని ఒక చేత్తో పట్టుకుని మరో చేతి బొటనవేలుతో స్క్రోల్ చేస్తారు. ఇలాంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉంటారు. సంబంధాలను కొనసాగించడంలో నమ్మదగినవారు. ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. భాగస్వామిని గుర్తించడంలో తెలివితేటలు ప్రదర్శిస్తారు.

మొబైల్ ఫోన్‌ని రెండు చేతులతో పట్టుకుని రెండు బొటనవేళ్ల సహాయంతో ఆపరేట్ చేసే వ్యక్తులు సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు. వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. పరిస్థితి ఎలా ఉన్నా, ఎలా జీవించాలో, దాని నుంచి ఎలా బయటపడాలో వారికి బాగా తెలుసు. వీరు చాలా త్వరగా కొత్త విషయాలను స్వీకరిస్తారు. ఇలాంటి వారికి ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం.

ఫోన్‌ను ఒక చేత్తో పట్టుకుని అదే చేతి బొటనవేలుతో స్క్రోల్ చేసే వారు నమ్మకంగా ఉంటారు. కొత్త విషయాలను స్వీకరించడానికి భయపడరు. తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి చాలా పనులు చేయగలరు. ఇలాంటి వ్యక్తులు సంతోషంగా ఉంటారు. జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఒత్తిడి లేని జీవితాన్ని ఇష్టపడుతారు. ఇలాంటి వారికి జీవితంలో ఏది లభించినా తేలిగ్గా స్వీకరిస్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story