Health News: ఈ జ్యూస్‌లతో కిడ్నీలో రాళ్లు కరిగించుకోండి..!

The Easiest Way to Get Rid of Kidney Stones Drink These 3 Types of Juice Daily
x

Health News: ఈ జ్యూస్‌లతో కిడ్నీలో రాళ్లు కరిగించుకోండి..!

Highlights

Health News: ఆధునిక కాలంలో మారిన జీవన పరిస్థితుల వల్ల చాలామందిలో కిడ్నీల రాళ్లు ఏర్పడుతున్నాయి.

Health News: ఆధునిక కాలంలో మారిన జీవన పరిస్థితుల వల్ల చాలామందిలో కిడ్నీల రాళ్లు ఏర్పడుతున్నాయి. దీనికి కారణం అనేకం ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు అతను చాలా బాధని అనుభవిస్తాడు. ఈ పరిస్థితిలో డైట్ ప్లాన్ చాలా ఆలోచనాత్మకంగా ఉండాలి. మీకు కిడ్నీ సమస్య ఉంటే ఇక్కడ ఇచ్చిన కొన్ని జ్యూస్‌ల సహాయంతో మీరు ఈ సమస్యను అధిగమించవచ్చు. అవి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

1. టమోటా రసం

కిడ్నీలో రాళ్లను తొలగించడంలో టొమాటో రసం బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిస్థితిలో రెండు టమోటాలు బాగా కడిగి వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. జ్యూస్‌లో ఉప్పు, ఎండుమిరియాల పొడి కలుపుకుని తాగాలి. కావాలంటే తయారుచేసుకున్న మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.

2. నిమ్మరసం

నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్‌ తొలగించడంలో సూపర్‌గా పనిచేస్తుంది. పెరుగును ఒక గిన్నెలో తీసుకుని అందులో ఒక చెంచా నిమ్మరసం వేసి రుచికి తగినట్లుగా ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

3. తులసి రసం

కిడ్నీలో రాళ్ల సమస్యను దూరం చేయడంలో తులసితో చేసిన రసం ఉపయోగపడుతుంది. ఈ పరిస్థితిలో తులసి ఆకుల రసాన్ని తీసి దానికి ఒక చెంచా తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం తినాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories