Coriander Water: పరగడుపున ధనియాల నీరు తాగితే అద్భుత ప్రయోజనాలు.. ఏంటంటే..?

Coriander Water: భారతీయ వంటకాలలో ధనియాలకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. వంటలలో వీటిని విరివిగా వాడుతారు.
Coriander Water: భారతీయ వంటకాలలో ధనియాలకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. వంటలలో వీటిని విరివిగా వాడుతారు. ఇది వంటకాలకు మంచి రుచిని ఆపాదిస్తుంది. అంతేకాదు ధనియాలలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. పరగడుపున ధనియాల నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ధనియాలలో పొటాషియం, కాల్షియం, విటమిన్ సి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.
ధనియాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది అనేక వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. ధనియాలలో విటమిన్ కె, సి, ఎ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు బలంగా వేగంగా పెరగడానికి దోహదం చేస్తాయి. ఉదయాన్నే ధనియాల నీరు తాగడం వల్ల జుట్టు రాలడం, చిట్లడం తగ్గుతుంది. మీరు ధనియాల నూనెని హెయిర్ మాస్క్‌గా కూడా అప్లై చేసుకోవచ్చు.
ధనియాలలో ఆహారాన్ని జీర్ణం చేసే గుణాలు అధికంగా ఉంటాయి. పరగడుపున ధనియాల నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీవక్రియ వేగవంతం అవుతుంది. ఈ రెండు లక్షణాలు మీ బరువు తగ్గించే ప్రక్రియలో సహాయపడతాయి. ధనియాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఉదయాన్నే ధనియాల నీళ్లు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది. ధనియాలలో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచే గుణాలు ఉన్నాయి. పరిశోధన ప్రకారం మీకు అధిక కొలెస్ట్రాల్ సమస్యలుంటే మీరు ధనియాల నీటిని రోజు తీసుకోవచ్చు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి ధనియాల నీరు తాగవచ్చు.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMTమా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపై చంపాలి - నీరజ్ భార్య సంజన
21 May 2022 7:43 AM GMTబేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...
21 May 2022 7:28 AM GMTధైర్యం కంటే భయం గొప్పది అంటున్న కొరటాల శివ
21 May 2022 6:55 AM GMTసమీపిస్తున్న వినాయ చవితి వేడుకలు.. నిమజ్జనం ఎక్కడ..?
21 May 2022 6:26 AM GMT