Sleep: గాడ నిద్రలో చెమటలు పడుతున్నాయా.. జాగ్రత్త..?

Sleep: గాడ నిద్రలో చెమటలు పడుతున్నాయా.. జాగ్రత్త..?
x

Sleep: గాడ నిద్రలో చెమటలు పడుతున్నాయా.. జాగ్రత్త..?

Highlights

Sleep: గాడ నిద్రలో ఉన్నప్పుడు చాలామందికి చెమటలు పడుతాయి. అయితే అందరు దీన్ని లైట్‌గా తీసుకుంటారు.

Sleep: గాడ నిద్రలో ఉన్నప్పుడు చాలామందికి చెమటలు పడుతాయి. అయితే అందరు దీన్ని లైట్‌గా తీసుకుంటారు. కానీ ఇది చాలా వ్యాధులకు సంకేతం. కాబట్టి తేలికగా తీసుకోకూడదు. మనం చాలా రోగాలకు వాడే మందులు రాత్రి నిద్రిస్తున్నప్పుడు చెమట పట్టేలా చేస్తాయి. మీడియా నివేదికల ప్రకారం.. ఈ పరిస్థితిని ఇడియోపతిక్ హైపర్ హైడ్రోసిస్ అంటారు. కాబట్టి రాత్రి నిద్రిస్తున్నప్పుడు చెమట పట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి.

TB వల్ల చెమట పడుతుంది..

మీకు టీబీ వచ్చినా రాత్రిపూట చెమటలు పడుతాయి. ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావితమయ్యేది ఊపిరితిత్తులపైనే. ఈ పరిస్థితిలో రోగులు ఖచ్చితంగా చెమట సమస్యలని ఎదుర్కొంటారు. కాబట్టి అలాంటి రోగులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సమయంలో బరువు కూడా తగ్గుతుంది.

క్యాన్సర్ వల్ల రాత్రిపూట చెమట

మీకు క్యాన్సర్ వచ్చినా రాత్రి నిద్రిస్తున్నప్పుడు చెమటలు పట్టే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. కొన్ని రకాల క్యాన్సర్లలో రాత్రిపూట చెమటలు పట్టడం జరుగుతుంది. శరీరం క్యాన్సర్‌తో పోరాడుతున్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో రాత్రిపూట జ్వరం, చెమటలు వస్తాయి.

గ్యాస్ సమస్య వల్ల చెమటలు వస్తాయి

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి, గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిజార్డర్ కారణంగా రాత్రి నిద్రిస్తున్నప్పుడు చెమటలు పడుతాయి. నిజానికి నిద్రిస్తున్నప్పుడు ఆహార గొట్టంలో తయారైన యాసిడ్ కడుపులో పేరుకుపోతుంది. దీని వల్ల ఛాతీలో మంటలు, చెమటలు పడుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories