పెసర పప్పుతో సూపర్ స్వీట్..

పెసర పప్పుతో సూపర్ స్వీట్..
x
Highlights

పప్పులతో కూరలు వండుకోవడమే కాకుండా ఎంతో రుచికరమైన స్వీట్స్‌ కూడా తయారు చేసుకోవచ్చు. డెయిలీ రొటీన్‌కు భిన్నంగా పెసరపప్పుతో స్వీట్ చేసుకుంటే... దాని...

పప్పులతో కూరలు వండుకోవడమే కాకుండా ఎంతో రుచికరమైన స్వీట్స్‌ కూడా తయారు చేసుకోవచ్చు. డెయిలీ రొటీన్‌కు భిన్నంగా పెసరపప్పుతో స్వీట్ చేసుకుంటే... దాని టేస్టే అమోఘం అనక తప్పదు. పిల్లలు సైతం ఎంతో ఇష్టంగా ఆరగించేస్తారు.. ఆరోగ్యకరమైన , రుచికరమైన పెసరపప్పు హల్వా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు

*పెసర పప్పు

*చెక్కర

*జీడి పప్పు

*కిస్‌మిస్‌

*యాలాకులు

*బాదాం పప్పు

*పాలు

*నెయ్య

ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి..అందులో పెసర పప్పును వేసుకుని డ్రై ప్రై చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది... ఇప్పుడు కడాయి నుంచి పప్పును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త కాగాక ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. వీటిని మాడనివ్వకుండా బాగా కలుపుతూ ఉండాలి..ఇప్పుడుత ఫ్రై అయిన జీడిపప్పును ఒక బౌల్‌లోకి తీసుకోవాలి...ఇప్పుడు డ్రై రోస్ట్‌ చేసి పెట్టుకున్న పెసర పప్పును పొడిలా చేసుకోవాలి..అందుకోసం మిక్సీ జార్‌లో వేసి పొడి చేయాలి.. ఇప్పుడు ఈ పెసరపప్పు పిండిని నెయ్యిలో వేపుకోవాలి. కొంచెం నెయ్యి ఆడ్ చేసుకోవాలి. ఇందులోనే పాలను పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. సిమ్‌ లో మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసు కోవాలి.

ఇప్పుడు కాసేపు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం పాలను ఆడ్ చేసి కలుపుకోవాలి. మళ్లీ స్టవ్ ఆన్ చేసుకుని.... యాలాకులను ఇందులో వేసుకోవాలి.. హై ఫ్లేమ్‌ పెట్టుకోవాలి. పెసర పప్పు బాగా ఉడికిన తరువాత చెక్కెరను వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలర్ ని చూస్తే రెడీ అయ్యిందా లేదా అన్నది అర్ధమవుతుంది.. బాగా కలుపుతూ ఉండాలి. ఉండలు రాకుండా జాగ్రత్త పడాలి ఇప్పుడు స్టవ్ ను ఆఫ్ చేసుకోవాలి... సర్వింగ్ బౌల్ లోకి హల్వాను తీసుకోవాలి. ఇప్పుడు హల్వా పైన గార్నిష్ కోసం పైన జీడిపప్పు, గ్రేటెడ్ బాదాం పప్పు వేసుకోవాలి.. అంతే పెసరపప్పు హల్వ రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories