షుగర్ వచ్చిందంటే చాలు... డైట్ విషయంలో తెగ జాగ్రత్తలు పడుతుంటారు. ఇది తినకూడదు.. అది తినకూడదు.. ఇది తింటే షుగర్ కంట్రోల్ లో ఉండదు అంటూ ఆహారంలో...
షుగర్ వచ్చిందంటే చాలు... డైట్ విషయంలో తెగ జాగ్రత్తలు పడుతుంటారు. ఇది తినకూడదు.. అది తినకూడదు.. ఇది తింటే షుగర్ కంట్రోల్ లో ఉండదు అంటూ ఆహారంలో లిమిటేషన్స్ పెట్టేస్తుంటారు.. చాలా వరకు కొన్ని కొన్ని ఆహార పదార్ధాలకు అపోహల కారణంగా తినకుండా దూరంగా ఉంటూ... ఎన్నో పోషకాలను కోల్పోతుంటారు.. అలాంటి వాటిల్లో ఓక్రా ఒకటి...అ దే లేడీ ఫింగర్గా పిలవబడే బెండకాయలు..
బెండకాయలు చెక్కర పేషంట్లకు దివ్యౌషధమనే చెప్పాలి.. ఇవి రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహంతో బాధపడే వారు నిస్సందేహంగా బెండకాయలను తమ డైట్లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎన్నో వెరైటీల రుచుకరమైన వంటకాలను బెండకాయలతో తయారుచేసుకోవచ్చు.. ఈ కూరగాయను సాంబారులోనూ వేసుకోవచ్చు. ఫ్రైగాను తినవచ్చు.. అలాగే మసాలా కూరల్లో, పచ్చడిలో ఇలా అన్ని రకాల వంటకాల్లో బెండకాయలను వానియోగించుకోవచ్చు. చిన్నప్పుడు అందరికీ గుర్తుండే ఉంటుంది..బెండకాయలు తింటే తెలివితేటలు , ముఖ్యంగా లెక్కలు బాగా వస్తాయని పెద్దవారు చెప్పేవారు...బెండలో ఉండే పోషకాల ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆ మాట వెనక ఉన్న అసలు వాస్తవం.
షుగర్ తో బాధపడేవారు...అనేక సమస్యలతో యుద్ధం చేస్తుంటారు..ముఖ్యంగా రక్తంలోని చక్కెర స్థాయిని కంట్రోల్ చేసేందుకు ఇష్టమైన ఆహారానికి దూరంగా ఉంటూ నోటిని కట్టేసుకుంటారు. బెండకాయలతో ఈ బెంగ తీరుతుందంటున్నారు డైటీషియన్లు.. బెండను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడం సులువవుతుందంటున్నారు.
బెండలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఎ, బి1 , బి2 , బి3 , బి9 , సి, ఈ, కె విటమిన్లు ఉంటాయి. అలాగే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి మినరల్స్ లభిస్తాయి. వీటితోపాటే ఫైబర్ కూడా అదనంగా ఉంటుంది.అందుకే ఇది ది బెస్ట్ వెజిటేబుల్గా పిలవబడుతోంది. అందుకే దీనిని రోజూ తీసుకున్నా... ఆరోగ్యానికి వచ్చే చింత ఏదీ లేదంటున్నారు వైద్యులు.
తక్కువ క్యాలరీలు గల బెండకాయలు షుగర్ పేషంట్స్ కే కాదు..అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే కూరగాయ. ఇది శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మలబద్దకం వంటి సమస్యలతో పోరాడుతుంది. ఆజీర్ణం వంటి కడుపు సమస్యలు రాకుండా జాగ్రత్తపరుస్తుంది.అన్‌హెల్దీ ఫ్యాట్‌ను కంట్రోల్ చేయడానికి బెండకాయలు ఉపయోగపడతాయి. దీని వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి, బీపీ,గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందంటున్నారు నిపుణులు. శాస్త్రవేత్తలు నిర్వహించిన కొన్ని పరిశోధనల ప్రకారం ప్రెగ్నెన్సీ సమయంలో రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నిర్వహించడానికి బెండకాయలు ఎంతగానో సహాయం చేస్తాయని తేలింది. అందుకే షుగర్ పేషంట్స్ మాత్రమే కాకుండా గర్భిణీలు కూడా బెండకాయలను ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకుంటే న్యూట్రిషనిస్టులు సిఫారసు చేస్తున్నారు.sugar patient diet, okra , lady finger , healthtips , lifestyle
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire