Knee Pain:మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. వీటిని తప్పకుండా తినండి..!

.Suffering from Knee Pain Be sure to Eat These
x

Knee Pain:మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. వీటిని తప్పకుండా తినండి..!

Highlights

Knee Pain:మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. వీటిని తప్పకుండా తినండి..!

Knee Pain: ఈ రోజుల్లో మోకాళ్ల నొప్పులు సర్వసాధారణం అయిపోయాయి. 30 ఏళ్లు దాటిన తర్వాత చాలా మంది యువత మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. నిజానికి బయటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఆహారంలో పోషక విలువలను చేర్చకపోవడం వల్ల ఇలాంటి సమస్య మొదలవుతుంది. ఈ పరిస్థితిలో మీరు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కాబట్టి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే ఆహారాల గురించి తెలుసుకుందాం.

1. నానబెట్టిన వాల్‌నట్‌లను తినడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 2 నెలల పాటు నిరంతరం వాల్‌ నట్‌లని తినడం ప్రారంభిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల కీళ్లనొప్పులు త్వరగా నయమవుతాయి.

2. పాలు, వెల్లుల్లి చాలా మంచి కలయిక. ఈ రెండిటిని కలిపి తింటే మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. దీన్ని 1 వారం పాటు అనుసరించిన తర్వాత మీరే ఫలితాన్ని చూస్తారు.

3. కీళ్ల నొప్పులకు విటమిన్-ఈ ఎంతో మేలు చేస్తుంది. ఈ పరిస్థితిలో మీరు బాదంపప్పును తినవచ్చు. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఆర్థరైటిస్‌ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.

4. బొప్పాయిలో పెద్ద మొత్తంలో విటమిన్-సి లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే బ్రకోలీలో కూడా కీళ్ల నొప్పులని తగ్గించే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories