Health Tips: జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా.. అయితే, ఈ 5 సూప్‌లు తప్పక తాగాల్సిందే..!

Soups for Cold and Cough: Suffering With Cold and Cough Then try With These 5 Soups Better Relief
x

Health Tips: జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా.. అయితే, ఈ 5 సూప్‌లు తప్పక తాగాల్సిందే..! 

Highlights

Soups for Cold and Cough: దగ్గు, జలుబు ప్రతి సీజన్‌లో వచ్చే సమస్య. దగ్గు బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్, అలెర్జీ, సైనస్ ఇన్ఫెక్షన్ లేదా జలుబు కారణంగా వస్తుంది.

Soups for Cold and Cough: దగ్గు, జలుబు ప్రతి సీజన్‌లో వచ్చే సమస్య. దగ్గు బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్, అలెర్జీ, సైనస్ ఇన్ఫెక్షన్ లేదా జలుబు కారణంగా వస్తుంది. కానీ, మన దేశంలో ప్రజలు ప్రతి సమస్యకు డాక్టర్ల వద్దకు వెళ్లరు. ఇలాంటి ఎన్నో హోం రెమెడీస్ మన వంటగదిలోనే దాగి ఉన్నాయి. వాటితో దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న వ్యాధులు తగ్గించుకోవచ్చు. ఒక గిన్నె వేడి సూప్ జలుబు, దగ్గు విషయంలో గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. మీ ఆహారంలో ఒక గిన్నెలో పోషకాలతో కూడిన వేడి సూప్‌ని చేర్చుకోవచ్చు. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం. వెల్లుల్లి, అల్లం, ఎండుమిర్చితో పాటు సీజనల్ వెజిటేబుల్స్ ఉపయోగించి మీరు ఆరోగ్యకరమైన సూప్ తయారు చేసుకోవచ్చు. చలిలో ఉపశమనం అందించడంతో పాటు, ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఇలాంటి పరిస్థితిలో, మీరు గుమ్మడికాయ, టమోటా, బ్రోకలీ, బీన్ వంటి సూప్‌లను ఆహారంలో చేర్చవచ్చు. ఈ సూప్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గుమ్మడికాయ సూప్..

గుమ్మడికాయ సూప్ ముక్కు కారటం, జలుబు సమస్య నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. నూనెలో ఒక చెంచా ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం వేయాలి. ఆ తరువాత దానిలో తరిగిన గుమ్మడికాయ, వెజిటబుల్ స్టాక్ జోడించండి. ఈ మిశ్రమం పూర్తిగా కలిసే వరకు ఉడికించాలి. చలికాలంలో కూడా ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. గుమ్మడికాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

టొమాటో, తులసి సూప్..

మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు, టొమాటో బాసిల్ సూప్ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సూప్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. నూనెలో కొన్ని వెల్లుల్లిని వేయించి, తరిగిన టమోటాలు, ఉప్పు వేయండి. కొద్దిగా టొమాటో రసం వేసి బాగా కలపాలి. చివరగా కొన్ని పోషక విలువలున్న తులసి ఆకులను వేసి బాగా మిక్స్ చేసి వేడిగా సర్వ్ చేయాలి.

పుట్టగొడుగుల సూప్..

మష్రూమ్ సూప్ చాలా పోషకమైనది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యల చికిత్సలో సహాయపడతాయి. బాణిలో నూనె లేదా నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. పుట్టగొడుగు ముక్కలు, నీరు పోయాలి. మిశ్రమాన్ని ఆవిరిలో కొన్ని నిమిషాలు ఉడికించాలి. చివరగా కొద్దిగా పాలు వేసి కొన్ని నిమిషాలు ఉడికించాలి. దీన్ని వేడిగా సర్వ్ చేయండి.

బ్రకోలీ, బీన్ సూప్..

నాన్ స్టిక్ పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె పోయాలి. అందులో కొన్ని తరిగిన ఉల్లిపాయలు వేయాలి. ఆ తరువాత బ్రకోలీ కాడలు వేసి కలుపుతూ ఉండాలి. దీని తర్వాత బ్రోకలీ, బీన్స్ వేసి కలపాలి. కొన్ని నిమిషాలు ఉడికించాలి. కొద్దిగా పాలు, కార్న్‌ఫ్లోర్‌ని వేసి కలపాలి. సూప్ కొద్దిగా చిక్కబడే వరకు మీడియం హీట్‌లో ఉడికించాలి. రుచిని మెరుగుపరచడానికి ఉప్పు, మిరియాలు జోడించండి. వేడి వేడిగా సిప్ చేస్తే చాలా బాగుంటుంది.

మిక్స్ వెజిటబుల్ సూప్..

ఒక బాణలో కొద్దిగా నూనె వేసి, అందులో తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్, కూరగాయలను వేయండి. అన్ని పదార్థాలను బాగా కలపండి. ఆ తరువాత దానిలో కొంచెం నీళ్లు పోసి, మిశ్రమాన్ని 10-15 నిమిషాలు ఉడికించాలి. రుచిని మెరుగుపరచడానికి ఉప్పు, మిరియాలు జోడించండి. దీన్ని వేడిగా సర్వ్ చేయండి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులను కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి వాటిని చికిత్స/మందు/ఆహారంగా తీసుకోవాలంటే ముందుగా డాక్టర్‌ని సంప్రదించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories