Smartphone Affect on Children: చిన్నపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? స్మార్ట్‌ఫోన్ల వల్ల పెరుగుతున్న ప్రమాదాలు

Smartphone Affect on Children: చిన్నపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? స్మార్ట్‌ఫోన్ల వల్ల పెరుగుతున్న ప్రమాదాలు
x

Smartphone Affect on Children: చిన్నపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? స్మార్ట్‌ఫోన్ల వల్ల పెరుగుతున్న ప్రమాదాలు

Highlights

Smartphone Affect on Children: 12 ఏళ్లలోపు పిల్లలకు స్మార్ట్‌ఫోన్ వినియోగం డిప్రెషన్, నిద్రలేమి, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది.

Smartphone Affect on Children : ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం చిన్నపిల్లల వరకు విస్తరించింది. పిల్లలు అల్లరి చేస్తున్నారని, భోజనం చేయడం లేదని, లేదా తల్లిదండ్రుల పనులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో చాలామంది పిల్లల చేతుల్లో ఫోన్లు పెడుతున్నారు. అయితే ఈ అలవాటు తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవల పీడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం, 12 ఏళ్లకు ముందే స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న పిల్లల్లో మానసిక, శారీరక సమస్యలు పెరుగుతున్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా డిప్రెషన్, నిద్రలేమి, ఊబకాయం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.

ఈ పరిశోధన కోసం అమెరికాలో 10 వేల మందికిపైగా పిల్లల డేటాను విశ్లేషించారు. అందులో చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న పిల్లల మానసిక స్థితి, నిద్ర అలవాట్లు ఇతర పిల్లల కంటే ఎక్కువగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. నిద్రలేమి కారణంగా శారీరక అభివృద్ధి కూడా ప్రభావితమవుతోందని అధ్యయనం స్పష్టం చేసింది.

ఈ అధ్యయన ప్రధాన రచయిత, పిల్లల మనోరోగ నిపుణుడు డాక్టర్ రాన్ బార్జిలే మాట్లాడుతూ.. ఈ పరిశోధనలో పిల్లలు ఫోన్లలో ఏ కంటెంట్ చూస్తున్నారో విశ్లేషించలేదని, కేవలం ఫోన్ ఉండటం వల్ల కలిగే ప్రభావాలనే పరిశీలించినట్లు తెలిపారు. అయినప్పటికీ ఫోన్ ఉన్న పిల్లల్లో మానసిక ఆరోగ్యం మరింత దెబ్బతింటోందని స్పష్టమైందన్నారు.

టాబ్లెట్లు లేదా ఇతర డిజిటల్ పరికరాలు ఉన్నప్పటికీ, స్మార్ట్‌ఫోన్ ఉన్న పిల్లలలో కనిపించిన ప్రభావాలు మరింత తీవ్రమని అధ్యయనం పేర్కొంది. దీంతో చిన్నపిల్లలకు వీలైనంతవరకు స్మార్ట్‌ఫోన్లు దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ ఇచ్చినా, పేరెంటల్ కంట్రోల్స్ తప్పనిసరిగా ఉపయోగించాలని, స్క్రీన్ టైమ్‌ను కట్టడి చేయాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories