Kitchen Tips: వంటగది నూను మరకలతో జిడ్డు జిడ్డుగా ఉందా? ఈ సాధారణ చిట్కాలతో మరకలు మాయం..!

Kitchen Tips
x

Kitchen Tips: వంటగది నూను మరకలతో జిడ్డు జిడ్డుగా ఉందా? ఈ సాధారణ చిట్కాలతో మరకలు మాయం

Highlights

Kitchen Tips: మహిళలు రోజులో ఎక్కువ సమయం వంటగదిలోనే గడుపుతారు.ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ అంటూ ఇలా వంట చేయడంతోనే ఎక్కువ సమయం గడిచిపోతుంది.

Kitchen Tips: మహిళలు రోజులో ఎక్కువ సమయం వంటగదిలోనే గడుపుతారు.ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ అంటూ ఇలా వంట చేయడంతోనే ఎక్కువ సమయం గడిచిపోతుంది. అయితే, వంట చేసేటప్పుడు గోడలపై ఎక్కువగా నూనె మరకలు పడటం సర్వసాధారణం. వివిధ వంటకాల వల్ల గోడలపై నూనె, ధూళి పేరుకుపోతుంది.ఇళ్లు క్లీన్ చేసేటప్పుడు ఈ నూనె మరకలు ఎంత రుద్దినా సరిగా పోవు. వాటిని శుభ్రం చేయడానికి ఎక్కువ సమయంతోపాటు శ్రమ కూడా అవసరం. అయితే,ఈ సులభమైన చిట్కాలను పాటిస్తే మరకలు సులవుగా పోతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వెనిగర్

ఒక గిన్నెలో అర కప్పు వెనిగర్, డిష్ వాషింగ్ లిక్విడ్ తీసుకోండి. దానికి ఒక కప్పు వేడి నీళ్లు కలిపి మిశ్రమాన్ని తయారు చేసి స్ప్రే బాటిల్‌లో ఉంచండి. దానిని కిచెన్ లోని గ్యాస్ స్టవ్ మీద స్ప్రే చేసి పది నిమిషాలు రుద్దండి. ఆపై శుభ్రంగా తుడవండి. ఇలా చేయడం వల్ల మరకలు మాయమై వంటగది గోడలు మెరుస్తాయి.

బేకింగ్ సోడా

గోడల నుండి నూనె మరకలను సులభంగా తొలగించడానికి బేకింగ్ సోడా కూడా ఉపయోగపడుతుంది. దీనికోసం, పావు కప్పు బేకింగ్ సోడా తీసుకుని నీటితో కలిపి పేస్ట్ లా చేయండి. తరువాత ఈ పేస్ట్‌ను నూనె జిడ్డు మరకలపై అప్లై చేసి 20 నిమిషాలు ఆరనివ్వండి. తరువాత ఒక శుభ్రమైన గుడ్డను నీటిలో ముంచి ఆ ప్రాంతాన్ని తుడవండి. ఇలా చేస్తే మరకలు తొలగిపోతాయి.

నిమ్మరసం

వంటగది టైల్స్‌పై ఉన్న నూనె మరకలను తొలగించడంలో నిమ్మరసం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీని కోసం, ఒక చిన్న గిన్నెలో కొంచెం డిష్ వాషింగ్ లిక్విడ్, సగం నిమ్మకాయ రసం వేసి బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమంలో స్క్రబ్బర్‌ను ముంచి, వంటగది గోడలను తేలికగా స్క్రబ్ చేయండి. తర్వాత కాటన్ వస్త్రంతో శుభ్రం చేయండి. వంటగది సింక్‌లు, టైల్స్ శుభ్రం చేయడానికి డిష్ వాషింగ్ లిక్విడ్, నిమ్మరసం మిశ్రమం బాగా పనిచేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories