Goli Soda : పెప్సీ, కోకాకోలాకు బైబై.. గోళీ సోడాకే విదేశీయులు జై జై

Goli Soda : పెప్సీ, కోకాకోలాకు బైబై.. గోళీ సోడాకే విదేశీయులు జై జై
x
Highlights

Goli Soda: భారతదేశ సాంప్రదాయ పానీయం 'గోళీ సోడా'కు అమెరికా, బ్రిటన్, యూరప్, గల్ఫ్ దేశాలతో సహా ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లలో బలమైన డిమాండ్ ఉంది.

Goli Soda: భారతదేశ సాంప్రదాయ పానీయం 'గోళీ సోడా'కు అమెరికా, బ్రిటన్, యూరప్, గల్ఫ్ దేశాలతో సహా ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లలో బలమైన డిమాండ్ ఉంది. గాజు గోళీలతో సీసాలో ఉండే ఈ సోడాకు వినియోగదారుల నుంచి భారీ స్పందన వస్తోందని, ఇది దాని విస్తరణకు దోహదపడుతుందని అధికారిక ప్రకటనలో ఆదివారం తెలిపారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ విభాగం అయిన అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (అపెడా) ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా.. గల్ఫ్ ప్రాంతంలోని అతిపెద్ద రిటైల్ గొలుసులలో ఒకటైన లులు హైపర్‌ మార్కెట్‌కు గోళీ సోడాను సరఫరా చేయడం ప్రారంభించింది. దీనిని 'గోళీ పాప్ సోడా'గా రీబ్రాండ్ చేశారు.

గోళీ సోడా ప్రత్యేకత

గాజు గోళీతో కూడిన సాంప్రదాయ సోడా సీసా ఇది. దీనిని 'గోల్డ్ స్పాట్ బాటిల్', 'గోటీ సోడా' లేదా 'బన్సీ సోడా' అని కూడా పిలుస్తారు. దీనిని 'కాడ్-నెక్ బాటిల్' అని కూడా అంటారు.

ఈ సీసా ముఖ్యంగా గ్రామాలు, చిన్న పట్టణాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. 90వ దశకానికి ముందు, ఇది స్థానికంగా తయారుచేసిన నిమ్మకాయ సోడా, ఇతర రుచులను సోడాకు బాగా ఉపయోగించే వారు. నేటికీ కొన్ని ప్రాంతాల్లో ఇది దేశీయ శీతల పానీయంగా విక్రయిస్తున్నారు.

మళ్లీ పుంజుకున్న గోళీ సోడా

ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన ఈ పానీయం అంతర్జాతీయ విస్తరణతో ప్రపంచ వేదికపై మళ్లీ గట్టిగా రీఎంట్రీ ఇస్తుంది. పెప్సీ, కోకోకోలా వంటి బహుళజాతి పానీయాల సంస్థల ఆధిపత్యం కారణంగా గోళీ సోడా డిమాండ్ దాదాపుగా తగ్గిపోయింది. గోళీ పాప్ సోడా దాని ప్రత్యేక ప్యాకింగ్‌తో స్పెషల్ గా నిలుస్తుందని ప్రకటనలో తెలిపారు. ఈ రీ బ్రాండింగ్ అంతర్జాతీయ మార్కెట్లను ఆకర్షించింది. పానీయాన్ని ఉత్తేజకరమైన, అధునాతన ఉత్పత్తిగా నిలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories