Children: పిల్లలు మొబైల్ ఫోన్‌ కోసం మొండిగా ప్రవర్తిస్తున్నారా..? ఇలా చేయండి..!

Children
x

Children: పిల్లలు మొబైల్ ఫోన్‌ కోసం మొండిగా ప్రవర్తిస్తున్నారా..? ఇలా చేయండి..!

Highlights

Children: ఈ రోజుల్లో పిల్లలు మొబైల్ లేకుండా ఆహారం కూడా తినరు. వారి దగ్గర నుండి మొబైల్ ఫోన్ లాక్కుంటే చాలు గట్టిగా ఏడవడం మొదలుపెడతారు.

Children: ఈ రోజుల్లో పిల్లలు మొబైల్ లేకుండా ఆహారం కూడా తినరు. వారి దగ్గర నుండి మొబైల్ ఫోన్ లాక్కుంటే చాలు గట్టిగా ఏడవడం మొదలుపెడతారు. ఫోన్‌ ఒక వ్యసనంగా మారింది. పిల్లలు ఆడుకోవడానికి బదులుగా ఎక్కువ గంటలు ఫోన్‌ను చూసుకుంటూ శారీరక శ్రమకు దూరమై చిన్న వయసులోనే వ్యాధుల బారిన పడుతున్నారు. కొన్నిసార్లు వారు మొబైల్‌లో వారికి సరికాని కొన్ని విషయాలను చూస్తారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మొబైల్ వ్యసనం కారణంగా కొంతమంది పిల్లలు ఊబకాయం బారిన పడ్డారని అనేక నివేదికలు వెల్లడించాయి. అంతేకాకుండా చిన్న వాటికే చిరాకు పడటం, ఆందోళన చెందడం, ఒత్తిడిగా భావించడం వంటి సమస్యలు చిన్న వయసులోనే మొదలవుతాయి. తరచుగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఫోన్ వ్యసనం నుండి బయటపడేయడానికి తిడతారు లేదా కొడతారు కానీ ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ వాడటం వారి జీవనశైలిలో ఒక భాగమైపోయింది కాబట్టి, నెమ్మదిగా పిల్లలను మొబైల్ వ్యసనం నుండి బయటపడేయడానికి ఈ సింపుల్ టిప్స్ పాటించండి.


తల్లిదండ్రులు ఫోన్ వాడకాన్ని తగ్గించాలి

పిల్లలు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి కొన్ని విషయాలు నేర్చుకుంటారు. తల్లిదండ్రులు రోజంతా ఫోన్‌లో బిజీగా ఉంటే పిల్లల కూడా అలానే పెరుగుతారు. వారు కూడా చిన్న వయసులోనే ఫోన్ ఉపయోగించాలని అనుకుంటారు. తల్లిదండ్రులే ఫోన్ చూస్తున్నారు కదా మనం ఎందుకు చూడకూడదు అని అనుకుంటారు. కాబట్టి, పిల్లల ముందు ఎప్పుడూ ఫోన్ వాడకండి.

ప్రేమగా వివరించండి

ఫోన్ వాడటం హానికరమని పిల్లలకు ప్రేమగా వివరించండి. అంతేకానీ, ఫోన్ ఎక్కువగా చూస్తున్నారని మీరు పిల్లలను తిట్టడం, కొట్టడం వంటి పనులు చేయడం మంచిది కాదు. ఎందుకంటే, వారు మరింత మొండిగా మారే అవకాశం ఉంది. మీ పిల్లలు ఫోన్ కోసం ఏడ్చినప్పుడు వారికి ఫోన్ ఇచ్చే బదులు మీరు వారితో టైం స్పెండ్ చేయండి. వారితఓ కాసేపు ఆడుకోండి. లేదా బొమ్మలు గీయడం, సంగీతం నేర్పించడం, డ్యాన్స్ వేయడం, యోగా, ఆటలు వంటివి చేయించండి. ఇది మొబైల్ వ్యసనాన్ని వదిలించుకోవడంలో సహాయపడటమే కాకుండా పిల్లల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

టైమ్ టేబుల్ తయారు చేసుకోండి

మీ పిల్లల కోసం టైం టేబుల్ ప్రిపేర్ చేయండి. ఉదయం నిద్ర నుండి రాత్రి పడుకునే వరకు ఏ టైంకు తినాలి? ఏం సమయంలో నిద్రపోవాలి? ఏ టైంలో ఆడుకోవాలి? అని ప్రతి దానికి ఒక సమయాన్ని కేటాయించండి.

పిల్లల దగ్గర ఫోన్ ఉంచవద్దు

పిల్లల దగ్గర ఫోన్ అస్సలు ఉంచకండి. పిల్లలు ఫోన్ ఉపయోగించకుండా ఉండాలంటే మీరు ఫోన్‌ను దూరంగా ఉంచాలి. ముఖ్యంగా రాత్రిపూట ఫోన్‌ను పిల్లలకు దగ్గరగా ఉంచకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories