Heatlh: నెయ్యి తింటే డయాబెటిస్‌ వస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే

Heatlh, Heatlh news, Lifestyle, Ghee, Ghee side effects
x

Heatlh: నెయ్యి తింటే డయాబెటిస్‌ వస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే

Highlights

నెయ్యి ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. కొలెస్ట్రాల్ రెండు రకాలు. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్ అయితే రెండోది శరీరానికి హానీ చేసే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు....

నెయ్యి ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. కొలెస్ట్రాల్ రెండు రకాలు. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్ అయితే రెండోది శరీరానికి హానీ చేసే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. అందులో నెయ్యిని మంచి కొలెస్ట్రాల్‌గా చెబుతుంటారు. అయితే నెయ్యిని అధికంగా తింటే మాత్రం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు రెండు స్పూన్ల కంటే ఎక్కువ నెయ్యిని తీసుకుంటే కొన్ని రకాల సమస్యలు తప్పవని అంటున్నారు. ఇంతకీ నెయ్యిని ఎక్కువగా తీసుకుంటే జరిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* నెయ్యిలో ఉండే కొవ్వు శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ పెరిగేందుకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కొవ్వు కణాలు అధికంగా పేరుకుపోవడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

* నెయ్యిలో కేలరీలు అధికంగా ఉంటాయి. అందుకే నెయ్యిని తీసుకుంటే బరువు త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది.

* ఎక్కువ కొవ్వు ఉండే నెయ్యిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచే అవకాశం ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్‌ పెరగడానికి కారణమవుతాయి. దీంతో టైప్‌ 2 డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

* నెయ్యిని ఎక్కువగా తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్, గ్యాస్‌, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నెయ్యి తిన్నవెంటనే పడుకుంటే మరిన్ని ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

* నెయ్యిని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్‌ సమస్యకు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. లివర్ పనితీరును తగ్గించి టాక్సిన్స్ శరీరంలో పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది.

* నెయ్యిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆయిల్ స్కిన్‌, మొటిమలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

* కొందరిలో నెయ్యి ఎక్కువగా తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలను ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories