భోజనం చేసిన వెంటనే ఐస్‌క్రీమ్‌ తింటున్నారా..!

భోజనం చేసిన వెంటనే ఐస్‌క్రీమ్‌ తింటున్నారా..!
x
Highlights

చాలమంది ఫంక్షన్ లకు లేదా పార్టీలకు వెళ్లిన ఆహారం కొంచెం ఎక్కువగా తీసుకుంటారు. ఇక పసందైనా విందు ఆరగించాక చల్లటి ఐస్‌క్రీమ్‌ తినేవారు ఉన్నారు. అయితే...

చాలమంది ఫంక్షన్ లకు లేదా పార్టీలకు వెళ్లిన ఆహారం కొంచెం ఎక్కువగా తీసుకుంటారు. ఇక పసందైనా విందు ఆరగించాక చల్లటి ఐస్‌క్రీమ్‌ తినేవారు ఉన్నారు. అయితే భోజనం చేసిన వెంటనే ఐస్‌క్రీమ్‌ తినవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆహారం తీసుకున్న వెంటనే ఐస్‌క్రీమ్ తినడం వల్ల జీర్ణాగ్ని చల్లారిపోయి జీర్ణక్రియ దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

అలాగే చాలమంది భోజనం తిన్న వెంటనే పళ్లు తింటుంటారు. భోజనంతో పాటు అరటి పండు తినేవారు చాల మంది ఉన్నరు. అయితే భోజనం తిన్న వెంటనే ఎలాంటి పళ్లు తినవద్దంటున్నారు నిపుణులు. ఆహారం తీసుకున్న వెంటనే పండు తినడం వల్ల జీర్ణాశయంలోకి చేరుకున్న పదార్థాలు పులిసిపోయే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి పళ్లు తిన్న రెండు గంటల తర్వాత భోజనం చేయాలి. లేదా భోజనం చేసిన రెండు గంటల తర్వాత పళ్లు తినాలి అంటున్నారు నిపుణులు.

అలాగే చేపలు, వెన్న కలిపి తినకూడదు. గుడ్లు, పాలు కలిపి తీసుకోకుండ ఉండటం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. చీజ్‌ ఆరోగ్యానికి మంచిదే! అయితే నిల్వ కోసం దానికి ఉప్పు చేరుస్తూ ఉంటారు. ఇలా ఉప్పు ఉండడం వల్ల ఆ చీజ్‌ మనం తినే ఇతర పదార్థాలతో కలిసి విరుద్ధ ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఉప్పు చేర్చకుండా తయారుచేసిన చీజ్‌ని మాత్రమే తినాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories