School Children: స్కూలు పిల్లలకు లంచ్ బాక్స్‌లో ఇవి ఉండేలా చూడండి


School Children: స్కూలు పిల్లలకు లంచ్ బాక్స్‌లో ఇవి ఉండేలా చూడండి
ldren: స్కూళ్లు మొదలైపోయాయి. ఇక పిల్లలకు లంచ్ బాక్సులు, స్నేక్స్ బాక్సులు రెడీ చేసి పెట్టాల్సిందే. అయితే కొంతమంది పిల్లలు ఏది పెట్టినా తింటారు. కానీ మరికొంతమంది పిల్లలు పెట్టినవి తినకుండా అలానే ఇంటికి తిరిగి తెస్తారు.
School Children: స్కూళ్లు మొదలైపోయాయి. ఇక పిల్లలకు లంచ్ బాక్సులు, స్నేక్స్ బాక్సులు రెడీ చేసి పెట్టాల్సిందే. అయితే కొంతమంది పిల్లలు ఏది పెట్టినా తింటారు. కానీ మరికొంతమంది పిల్లలు పెట్టినవి తినకుండా అలానే ఇంటికి తిరిగి తెస్తారు. అంతేకాదు స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ప్రత్యేకమైన ఫుడ్‌ని ఇవ్వాలని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ ఫుడ్ డీటైల్స్ ఏంటో చూసేద్దామా.
చాలామంది పిల్లలకు స్నేక్స్ ఎక్కువగా బయట నుంచి తెచ్చినవే ఇస్తుంటారు. ఇక లంచ్ కోసం అయితే పులిహోర, పుదీనా, టమాటా, ఎగ్ రైస్‌లు ఎక్కువగా పెట్టేస్తూ ఉంటారు. కానీ వీటి వల్ల పిల్లలకు ఎంత బలం అందుతుంది. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఆరోగ్యాన్ని ఎంతలా పాడుచేస్తాయి? ఇవన్నీ తెలిసి కూడా చేసే సమయం లేకనో, చేసే ఆసక్తి లేకనో చాలామంది పేరెంట్స్ పిల్లలకు ఇలాంటి లంచ్, స్నాక్స్‌లు పెట్టి పంపించేస్తూ ఉంటారు. అయితే ఏం పెట్టాలిమరి.
రంగుల కూరగాయలు, పండ్లు
పిల్లలకు రంగు రంగుల కూరగాయలు, పండ్లను కట్ చేసి వాటిని ఒక బాక్స్ లో పెట్టాలి. అయితే ఇవి తినాలని అనిపించేంత వరకు పిల్లలకు ఈ కూరగాయలు, పండ్లపై తేనె లేదా పెప్పర్ లేదా కాస్త ఉప్పు చల్లి అలవాటు చేయాలి. ఇవి కూడా చాలా తక్కువగా చల్లాలి. అంతేకాదు వీటిని అందమైన ఆకృతిలో కట్ చేసి ఇస్తే పిల్లలు చాలా ఇంట్రెస్ట్‌గా తింటారు.
డ్రై ఫ్రూట్స్
జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా, వాల్ నట్స్.. వీటిని ముందు రోజు నానబెట్టి ఆ తర్వాత రోజు పిల్లలకు బాక్సులో పెట్టాలి. ఇవి తియ్యగా ఉంటాయి కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. కొంతమంది పిల్లలు ముందు తినను అని చెప్పినా రోజూ తినడం వల్ల ఆ రుచికి అలవాటు పడతారు. అందుకే ప్రతిరోజూ వీటినికొన్ని ఇవ్వడం ఆరోగ్యానికి చాలామంచిది. వీటితో పాటు నానబెట్టిన పల్లీలు కూడా చేర్చొచ్చు.
ప్రోటీన్ ఆహారం
పిల్లలకు ఉడకబెట్టిన గుడ్లు లేదా పన్నీర్ లేదా చికెన్ ముక్కలను బాక్సులో పెడితే పిల్లల శరీరానికి ప్రోటీన్ ఎక్కువగా అందుతుంది. దీనివల్ల పిల్లలు ఎక్కువగా అలసిపోకుండా ఉంటారు. చదువులోనూ ఆటల్లోనూ కూడా ఉత్సాహంగా ఉంటారు.
ఇంటి వంటలు
ఇర ఇంట్లో చేసిన ఆహారమేదైనా పిల్లలకు ఇవ్వొచ్చు. లంచ్ బాక్సులో పెట్టాలంటే ముద్దపప్పు అన్నం, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ ఇలా మూడు రంగులున్న కూరగాయలతో అన్నం, ఆలు పరాటా, చిట్టి చిట్టి చపాతీలు, చిట్టి చిట్టి దోశలు, ఇడ్లీ ముక్కలు, ఉప్మా.. ఇలా వెరైటీగా ఇంట్లో చేసినవి పెట్టినా పిల్లలు ఇష్టంగా తింటారు.
ప్రతి పేరెంట్ ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. పిల్లలకు ఏదో ఒక ఆహారం పెట్టేసిన పంపించేసాము కదా అని అనుకోకుండా పిల్లలకు మంచి పౌష్టికాహారం పెట్టాలని ఆలోచించి పెడితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు, పిల్లలకు లంచ్ బ్యాగ్‌లో పెట్టే ఆహారాల్లో వెరైటీలు ఉండాలి. అలాగే పేరెంట్స్ చాలా ఆసక్తిగా చేసి పెట్టాలి. అప్పుడే పిల్లలు ఇంట్రెస్ట్‌గా మీరు ఇచ్చిన ఫుడ్ తిని ఖాళీ బాక్సు ఇంటికి తీసుకొస్తారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



