ఉప్పుతో సిరిసంపదలు.. రుచికి మాత్రమే కాదు అద్భుత అవకాశాలకి కూడా..!

Salt Vastu Tips: ప్రతి ఒక్కరి ఇంట్లో ఉప్పు ఉంటుంది. అందరు దీనిని వంటల రుచిని పెంచడానికి వాడుతారు.

Arun Chilukuri
Published on: 16 March 2023 7:56 PM IST
Salt Brings not Only Taste but Also Wealth if you Know Some Things According to Vastu you will be Surprised
X

ఉప్పుతో సిరిసంపదలు.. రుచికి మాత్రమే కాదు అద్భుత అవకాశాలకి కూడా..!

Salt Vastu Tips: ప్రతి ఒక్కరి ఇంట్లో ఉప్పు ఉంటుంది. అందరు దీనిని వంటల రుచిని పెంచడానికి వాడుతారు. కానీ కొద్దిమందికి మాత్రమే దీని విలువ తెలుసు. వాస్తు ప్రకారం ఉప్పువల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా ఇంట్లోని నెగటివ్‌ శక్తులని తొలగిస్తుంది. పాజిటివ్‌ శక్తిని ప్రసరిస్తూ కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతుంది. ఉప్పు గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఈరోజు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం ఉప్పును లోహపు పాత్రలోనూ నిల్వ చేయకూడదు. ఉప్పును ఎల్లప్పుడూ గాజు సీసాలో భద్రపరచాలి. దీనివల్ల ఇంట్లో ఆనందం ,శాంతి ఉంటుంది. డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు. మీరు చాలాకాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా రాకపోయినట్లయితే ఇల్లు శుభ్రం చేసేటప్పుడు అందులో కొంచెం ఉప్పువేసి క్లీన్‌ చేయండి. వారానికి ఒకటి రెండుసార్లు ఇలా చేస్తే అద్భుత ఫలితాలు చూస్తారు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు ఇంటి నుంచి నెగిటివ్‌ శక్తిని పారదోలుతుంది. ఇందుకోసం బాత్రూంలో ఒక గాజు గిన్నెలో రా ఉప్పుని పోసి ఒక మూలలో ఉంచాలి. దీనివల్ల ప్రతికూల శక్తులు ఇంటికి దూరంగా ఉంటాయి. ఇంట్లో పాజిటివ్‌ శక్తి ప్రసరిస్తుంది. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వారిని వారానికి ఒకసారి స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు ఉప్పువేసి స్నానం చేయించాలి. దీనివల్ల అలర్జీ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆర్థిక సంక్షోభంలో ఉంటే ఉప్పుతో నివారణ చేయవచ్చు. ఇందుకోసం ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల ఉప్పు, నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని మూలలో పెట్టాలి. దీనివల్ల ధనంరాక మొదలవుతుంది. ఇంట్లోని వ్యక్తులు మానసిక ఒత్తిడికి గురైతే స్నానం చేసే నీటిలో చెంచా ఉప్పు వేసి స్నానం చేసేలా చూడాలి. దీనివల్ల వారు ఒత్తిడి నుంచి దూరమవుతారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story