అక్కడ 21 రోజులు వరకు సూర్యుడు అస్తమించడు!

అక్కడ 21 రోజులు వరకు సూర్యుడు అస్తమించడు!
x
Highlights

వేసవికాలంలో అక్కడ 21 రోజులు సూర్యుడు అస్తమించడు. అందేంటీ సూర్యుడు అస్తమించని ప్రాంతం కూడా ఉందా అని ఆశ్చర్యపోకండి. నిజంగానే ఉంది. రష్యా లోని సెయింట్...

వేసవికాలంలో అక్కడ 21 రోజులు సూర్యుడు అస్తమించడు. అందేంటీ సూర్యుడు అస్తమించని ప్రాంతం కూడా ఉందా అని ఆశ్చర్యపోకండి. నిజంగానే ఉంది. రష్యా లోని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో ఈ వింత చోటుచేసుకుంటుంది. ఎండకాలంలో దాదాపు 21 రోజులు జూన్‌ 11 నుంచి జులై 2 వరకు సూర్యుడు అస్తమించడు. అక్కడ 24 గంటలూ వెలుగులు కనిపిస్తూనే ఉంటాయి. ఈ సమయంలో 'లేట్‌ నైట్‌ వాక్స్‌' అంటూ ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటారు. వైట్‌ నైట్స్‌ ఫెస్టివల్‌ జరుపుతుంటారు. వీటిని చూడ్డానికి సందర్శకులు ఎక్కడెక్కడి నుంచో వస్తుండటం విశేషం.

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌... రష్యాలో రెండో అతి పెద్ద నగరం. నేవా నది ఒడ్డున ఫిన్లాండ్‌ అఖాతం దగ్గర బాల్టిక్‌ సముద్ర తీరంలో ఉంది. అద్భుతమైన ఆర్కిటెక్చర్‌ భవంతులతో కనువిందు చేస్తుంది ఈ నగరం. ఇంకా ఈ నగరంలో 42 దీవులున్నాయి. దీని మీదుగా 40 నదులు ప్రవహిస్తుంటాయి. అందుకే దీన్ని 'ది వెనిస్‌ ఆఫ్‌ ది నార్త్‌' అని పిలుస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories