Rice: అన్నం తెలుపులో మాత్రమే కాదు.. చాలా రంగుల్లో ఉంటుంది.. కానీ ప్రయోజనాలు వేరు..

Rice is available not only in white but also in Black, Red and Brown learn the benefits
x

 అన్నం తెలుపులో మాత్రమే కాదు.. చాలా రంగుల్లో ఉంటుంది.. కానీ ప్రయోజనాలు వేరు..

Highlights

* బియ్యం తెలుపురంగులో మాత్రమే కాకుండా చాలా రంగుల్లో ఉంటాయి

Rice Benefits: సాధారణంగా అందరు ప్రతిరోజు అన్నం తింటారు. రోజుకు మూడు పూటలు అన్నమే తింటారు. కొంతమంది మాత్రం చపాతి తింటారు. అయితే ఎక్కువమంది మాత్రం అన్నమే తింటారు. అది తెలుపు రంగులో ఉంటుంది. కానీ బియ్యం తెలుపురంగులో మాత్రమే కాకుండా చాలా రంగుల్లో ఉంటాయి. నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, బ్రౌన్‌ ఇలా చాలా రంగుల్లో దొరుకుతాయి. దీంతో చేసిన అన్నం అదే రంగులో ఉంటుంది. అయితే ఈ రకమైన అన్నం ఒక్కోటి వేర్వేరు ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

బ్లాక్ రైస్: ఆంథోసైనిన్ పిగ్మెంట్ కారణంగా ఈ బియ్యం రంగు నల్లగా ఉంటుంది. అధిక పోషక విలువలు కలిగిన ఈ బియ్యంలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. తెల్ల బియ్యం కంటే చాలా తక్కువ కొవ్వును కలిగి ఉంటాయి. ప్రొటీన్లు, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ బియ్యం గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాలేయంలో ఉన్న హానికరమైన పదార్థాలను తొలగిస్తాయి.

రెడ్ రైస్: రెడ్ రైస్‌లో ఆంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది బియ్యానికి ఎరుపు రంగును ఇస్తుంది. ఈ బియ్యంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది తింటే వెంటనే ఆకలి అనిపించదు. గుండె, మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గాలనుకునే వారికి ఇది గొప్ప ఎంపిక.

గ్రీన్ రైస్: ఇవి వెదురు గింజలు. వాటిని వెదురు బియ్యం లేదా ముళయారి అని అంటారు. గ్రీన్ రైస్ పొటాషియం, ప్రోటీన్లకు మంచి మూలం. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివని భావిస్తారు. కానీ వెదురు జీవిత చక్రం పూర్తయినప్పుడు మాత్రమే వాటిని సేకరించవచ్చు కాబట్టి ఇవి అంత సులభంగా దొరకవు.

బ్రౌన్ రైస్: బ్రౌన్ రైస్ తృణధాన్యాల వర్గంలోకి వస్తుంది. ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. నిజానికి, బియ్యంపై ఉండే ఊక పొరలో చాలా పోషకాలు ఉంటాయి. బ్రౌన్ రైస్‌లో ఈ పొర తీసివేయరు అలాగే ఉంటుంది. ఊక పొరను తొలగిస్తే అది తెల్ల బియ్యం అవుతుంది. బ్రౌన్ రైస్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌తో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్‌తో సమృద్ధిగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories