ఈ చిట్కాలు పాటిస్తే.. పాదాల పగుళ్లకు స్వస్తి

ఈ చిట్కాలు పాటిస్తే.. పాదాల పగుళ్లకు స్వస్తి
x
Highlights

ఈ చిట్కాలు పాటిస్తే.. పాదాల పగుళ్లకు స్వస్తి ఈ చిట్కాలు పాటిస్తే.. పాదాల పగుళ్లకు స్వస్తి

పాదాలు పగిలితే.. భరించలేనంత నొప్పి కలుగుతుంది. ఇక నడుస్తుంటే కలిగే బాధ వర్ణాతీతం. ఒకోసారి పగుళ్లలో నుంచి రక్తం కూడా కారుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే.. పాదాల పగుళ్లు వంటి సమస్యలకు స్వస్తి చెప్పవచ్చు అంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఆముదము మరియు బేకింగ్ సోడాతో పగుళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

ఆముదమును పగిలిన వేళ్ళకు రాత్రి పూట పట్టించి మరుసటి రోజు శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఆముదమును ఒంటికి పట్టించి 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే.. అందమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు అంటున్నారు నిపుణులు. వేడి చేసిన ఆముదమును రాత్రి పడుకునే ముందు పాదాలకు పట్టించి, ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు

అరికాళ్లు పగుళ్ళతో బాధపడే వారు.. కొంచెం బేకింగ్ సోడాని గోరు వెచ్చని నీటీతో కలిపి ఒక 30 నిమిషాలు కాళ్లని నీటిలో ఉంచి, తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అరికాళ్ళ పగుళ్ళనుండి ఉపశమనం లభిస్తుంది అంటున్నారు నిపుణులు. అలాగే చేతి గోళ్ళు మరియు వాటి చిగుళ్ళ సంరక్షణలో బేకింగ్ సోడా ముఖ్య పాత్ర పోషింస్తుంది. నల్ల మచ్చలు, మొటిమల వల్ల బాదపడే వారు.. కొంచెం బేకింగ్ సోడాని నీటితో కలిపి ముఖానికి పట్టిస్తే మంచి కాంతివంతమైన చర్మంతో పాటు.. నల్ల మచ్చలు, మొటిమలు తోలగిపోయే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్యనిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories