Pumpkin Seeds: గుమ్మడి గింజలు ఇలా తింటే జీర్ణ సమస్యకు చెక్‌.. మలబద్దకం పరార్‌..!

Pumpkin Seeds: గుమ్మడి గింజలు ఇలా తింటే జీర్ణ సమస్యకు చెక్‌.. మలబద్దకం పరార్‌..!
x
Highlights

Pumpkin Seeds: గుమ్మడి గింజలు పోషక విలువలతో నిండిన సహజ ఆహారం.

Pumpkin Seeds: గుమ్మడి గింజలు పోషక విలువలతో నిండిన సహజ ఆహారం. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణ ఆరోగ్యం నుంచి గుండె ఆరోగ్యం వరకూ విస్తృతంగా మేలు చేస్తాయి. గుమ్మడి గింజల్లో ఉండే పోషకాలతో పాటు వాటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్, ఐరన్‌, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు కూడా అందిస్తాయి. ఇందులో అధికంగా ఉండే డైటరీ ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యకు ఇది మంచి సహజ పరిష్కారం.

గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో గుమ్మడి గింజలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దీని వల్ల గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది.

గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్‌ ఉత్పత్తికి తోడ్పడి, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు రోజూ స్నాక్‌గా గుమ్మడి గింజలు తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.

ఇమ్యూనిటీని పెంచడంలో కూడా గుమ్మడి గింజలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. శరీర రోగనిరోధక శక్తిని బలపరిచి, సీజనల్‌ వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. అలాగే ఇందులోని డైటరీ ఫైబర్‌ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచి, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు తోడ్పడుతుంది.

అంతేకాదు గుమ్మడి గింజల్లో విటమిన్‌ E ఉండటం వల్ల మంటలు, నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి. యూరినరీ ఇన్ఫెక్షన్లకు సహజ పరిష్కారంగా కూడా గుమ్మడి గింజలు ఉపయోగపడతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories