అతి నడక అంత మంచిది కాదు

అతి నడక అంత మంచిది కాదు
x
Highlights

నడక అరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలిసిందే. అయితే నడక మచింది కదా అని రోజుకు మైళ్ళకు మైళ్ళు నడవడం మంచిది కాదని పరిశోధకులు అంటున్నారు. రోజులో...

నడక అరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలిసిందే. అయితే నడక మచింది కదా అని రోజుకు మైళ్ళకు మైళ్ళు నడవడం మంచిది కాదని పరిశోధకులు అంటున్నారు. రోజులో ఎక్కువ మెుత్తంలో నడవడం వల్ల వేల కాలరీలు ఖర్చు అవుతాయి కానీ వృద్ధులకూ, ఎలాంటి ఆరోగ్య సమస్య లేని వారికి హాని జరిగే ప్రమాదం లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు. ఊబకాయులకు ఇది మంచిదే అయినా కొంత మందికి ఇది కొన్ని అనర్ధాలకు దారి తీస్తుందని అంటున్నారు నిపుణులు. వృద్ధులు ఇన్ని వేల అడుగులు నడవడం వలన వయస్సు రీత్యా వచ్చే కాళ్లనొప్పులతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలూ తలెత్తవచ్చని వారు చెబుతున్నారు.

సాదరణంగా ఓ వ్యక్తి తన రోజు వారిలో భాగంగా మూడు వేల నుంచి నాలుగు వేల అడుగులు మాత్రమే నడవగలడనీ అధ్యయనాలు చెబుతున్నాయి. అరోగ్యంగా ఉండానికి ఒక్క వ్యక్తికి అంతే నడక సరిపోతుందని నిపుణులు అంటున్నారు. ఇంతకన్నా ఎక్కువ నడవాలనుకునేవారు కొన్ని ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అయితే వ్యాయామాలన్నింటిలోకి నడక వ్యాయామం ఉత్తమమైనది. నడకతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట నుండి గంటసేపు నడస్తే చాలు. నడిచేటప్పుడు తప్పనిసరిగా షూ ధరించాలి. నడకకు ముందు కనీసం 10 నుండి 12 నిమిషాలు వార్మప్ చేయాలి. శరీరానికి చురుకుపుట్టించే వ్యాయామాలు, కాళ్ళుచేతులను సాగదీయటం వంటివి చేయాలి. నడక నుంచి మెుదలై తర్వాత వేగంగా నడవాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories