చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండటానికి జాగ్రత్తలు

చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండటానికి జాగ్రత్తలు
x
Highlights

చలితీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో... అందరిలోనూ వనుకు మొదలవుతోంది.

చలితీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో... అందరిలోనూ వనుకు మొదలవుతోంది. మరీ ముఖ్యంగా శీతాకాలంలో చలి కారణంగా చర్మం సమస్యలు మొదలవుతాయి.ఈ సమస్య ప్రతి ఒక్కరిని వేధిస్తుంటుంది. ఒంట్లో తేమ తగ్గడం కారణంగా చర్మం పొడిబారుతుంది, దురదతో పాటు పగిలిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. మరి శీతాకాలంలో చర్మం పొడిబార కాతివంతమైన చర్మం కావాలన్నా...కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు నిగనిగలాడే చర్మం మీ సొంతం.

ముఖంలో తేమ ఉన్నప్పుడే చర్మం తేజస్సుగా ఉంటుంది. కాబట్టి దానిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అందుకే సహజ పద్ధతుల ద్వారా చర్మానికి తేమను అందించడంతో పాటు ఆ తేమ పోకూడా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ సీజన్‌లో అధికంగా లభించే నారింజ తొనలు మన శరీరాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి సహకరిస్తాయి. నారింజ తొక్కచర్మాన్ని స్మూత్‌గా మార్చుతుంది. అయితే వాటిని నేరుగా అప్లై చేయకుండా ముందుగా తొక్కలను ఎండబెట్టుకోవాలి. వాటిని మిక్సిలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం ఈ నారింజ తొక్కల పొడిలో కొంచెం తేనె, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఓ పదినిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో కడిగెయ్యాలి.

రోజూ ఒక ఆపిల్ తింటే అనారోగ్యం దరిచేరదు అంటారు. అపిల్ పండే కాదు దాని తొక్కతోనూ మంచి తేజవంతమైన చర్మాన్ని పొందవచ్చు. ఆపిల్ తొక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. అందులో కాస్త తేనె, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు ముఖానికి అలాగే ఉంచుకుని ఆ తరువాత నాటితో కడిగేయ్యాలి. చల్లటి నీటిని వాడకుండా గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం రోజుల పాటు పాటిస్తే ముఖం మెరిసిపోతుంది. ఆపిల్, నారింజనే కాదు...అరటి పండు చర్మకాంతిని కాపాడుతుంది. బాగా మగ్గిన అరటి పండ్లను పేస్ట్‌గా చేసుకుని అందులోనూ తేనె, పెరుగు వేసి కలిపి ముఖానికి రాసుకుని కాసేపయ్యాక కడిగెయ్యాలి. పండ్లే కాదు కూరగాయలు చర్మానికి మేలు చేస్తాయి. టమోట రసం తీసి అందులో కాస్త పసుపు , పెరుగు కలిపి ముఖానికి రాయాలి. కాసేపటికి ముఖాన్ని కడిగెయ్యాలి. ఇలా తరచుగా చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.

వీటితో పాటు స్నానం చేసేప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువ సేపు స్నానం చేయకుండా ఐదు పది నిమిషాల్లో స్నానాన్ని ముగించాలి. చలి ఎక్కువగా ఉంది కదా అని వేడి వేడి నీటితో స్నానం చేస్తారు..అలా కాకుండా గోరువెచ్చటి నీటినే ఉపయోగించాలి. లేకపోతే చర్మంలోని సహజసిద్ధమైన నూనెలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ నూనెలు కనుగ పోతే చర్మం ఖచ్చితంగా పొడిబారుతుంది. స్నానం చేసిన తరవాత చర్మం పూర్తిగా పొడిబారకముందే శరీరానికి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. అలా చేయడం వల్ల తేమను ఎక్కువ సేపు నిలుపుకోగలము.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories