దానిమ్మ తింటే ఎంత మేలో..

దానిమ్మ  తింటే ఎంత మేలో..
x
Highlights

పండ్లు తినడం వల్ల అరోగ్యవంతమైన జీవితం మన సొంతమవుతుంది. ముఖ్యంగా దానిమ్మను రోజూ తినడం వలన రోగాలు మన దరి చేరవని నిపుణులు చెబుతున్నారు. వాటి గింజలను...

పండ్లు తినడం వల్ల అరోగ్యవంతమైన జీవితం మన సొంతమవుతుంది. ముఖ్యంగా దానిమ్మను రోజూ తినడం వలన రోగాలు మన దరి చేరవని నిపుణులు చెబుతున్నారు. వాటి గింజలను రోజూ అరకప్పు తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే బ్యాక్టీరియల్‌, వైరల్‌ వచ్చే వ్యాధులను నిరోధించడం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పండు శరీరంలో మంచి గుడ్ కొలెస్ట్రాల్‌ ఉత్పత్తిని పెంచుతుంది. దానిమ్మ గింజల్లో ఫోలిక్‌ యాసిడ్‌ ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల రక్తహీనత తగ్గుస్తుంది. అలాగే అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.

మానసిక వ్యాధులను ఎదుర్కొవడంలో కూడా దానిమ్మ ఉపయోగపడుతుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవాలంటే ప్రతిరోజూ దానిమ్మ గింజలు తినాలి. దానిమ్మ గింజలు ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లు విడుదల కాకుండా చూస్తుంది. ఈ పండులోని విటమిన్లు, ఖనిజాలు, ఫోలిక్‌ యాసిడ్‌ గర్భం ధరించిన మహిళలకు ఎంత మేలు చేస్తుంది వీటిని తీసుకోవడం వల్ల గర్భిణులకు కాళ్ల నొప్పులు వాపులు రాకుండా ఉంటాయి.

దానిమ్మ గింజలే కాకుండా వాటి రసం శరీరానికి ఉపయోగపడుతుంది. రోజూ రెండు కప్పుల దానిమ్మ రసం తాగడం వల్ల బరువు తగ్గుతారు. పొట్ట నిండిన భావన కూడా కలుగుతుంది. ఈ కారణంగా ఆకలి వేయదు. వీటిని తినడం వల్ల జీవక్రియల రేటు మెరుగుపడేలా చేస్తుంది సులభంగా బరువు తగ్గేందుకూ తోడ్పడుతుందని నిపుణులు కూడా సూచిస్తున్నారు. సో ఇక రోజుకు ఒక్క దానిమ్మ తినడానికైనా ప్రయత్నిచండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories