Plant Care: నీళ్లు ఎక్కువ పోస్తున్నా మీ మొక్కలు ఏపుగా పెరగడం లేదా? ఈ టిప్స్ పాటించండి

Plant Care: మొక్కలను ఇంటికి తెచ్చేముందు ఆరోగ్యకరమైన మొక్కలనే తెచ్చుకుంటారు. వాటికి ఎండ అందే చోటే పెడతారు. సమయానికి నీళ్లు కూడా పోస్తుంటారు. అయినా చాలామందికి మొక్కలు ఏపుగా పెరగవు. పైగా ఎండిపోయి ఒకరోజు ఆ మొక్క చచ్చిపోతుంది.

Indira Ram
Updated on: 27 Jun 2025 7:31 PM IST
Plant Care
X

Plant Care: నీళ్లు ఎక్కువ పోస్తున్నా మీ మొక్కలు ఏపుగా పెరగడం లేదా? ఈ టిప్స్ పాటించండి

Plant Care: మొక్కలను ఇంటికి తెచ్చేముందు ఆరోగ్యకరమైన మొక్కలనే తెచ్చుకుంటారు. వాటికి ఎండ అందే చోటే పెడతారు. సమయానికి నీళ్లు కూడా పోస్తుంటారు. అయినా చాలామందికి మొక్కలు ఏపుగా పెరగవు. పైగా ఎండిపోయి ఒకరోజు ఆ మొక్క చచ్చిపోతుంది. అయితే మొక్కను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ టిప్స్ పాటిస్తే మొక్క ఏపుగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

మొక్కలను పెంచాలంటే చిన్నపిల్లలను పెంచినట్లే పెంచాలి. వాటికి కావాల్సిన పోషకాలన్నీ ఇస్తేనే అవి ఏపుగా పెరుగుతాయి. అందుకే సరైన సమయంలోసరైన పోషకాలు ఈ మొక్కలకు అందిస్తే ఆరోగ్యంగా ఉంటాయి.

అరటిపండ్లు

మీరు ఇండ్లలో ఎక్కువగా అరటి పండ్లు తింటూ ఉంటారుగా. ఇలా తిన్నప్పుడు తొక్కలను ఈ సారి బయట పడేయకండి. ఒక పెద్ద మూత ఉన్న డబ్బాలో ఈ అరటి తొక్కలను మొక్కలుగా చేసి ఉంచండి. ఇలా కొన్ని ముక్కలు అయిన తర్వాత వాటిని వారానికి ఒక సారి చెట్ల మొదళ్ల దగ్గర మట్టి తీసి, ఈ అరటి ముక్కలను ఆ మట్టిలోపల వేసి, వాటిపైన మళ్లీ మట్టితో కవర్ చేయండి. ఇలా ఒక సారి మొదళ్ల ప్రాంతంలో మరొక సారి కుండీ చివర్లలో ఇలా చేయడం వల్ల మంచి పోషకాలు మొక్కకు అందుతాయి.

ఉల్లిపాయ, బంగాళదుంప తొక్కలు

ఉల్లిపాయను ఒలిచినప్పుడు అలాగే బంగాళదుంపను చెక్కినప్పుడు వచ్చే చెత్తను ఎప్పటికప్పుడు మొక్కలకు వేసే యాలి. ఇంకా మీకు సమయం ఉంటే ఈ రెండింటిని మిక్సీ పట్టి వేసినా మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి.

బియ్యం నీరు

బియ్యాన్ని కడుగుతున్నప్పుడు వచ్చిన నీటిని ఒక మూత ఉన్న డబ్బాలో వేసి ఉంచాలి. మూడు రోజుల తర్వాత ఆ నీటిని కొంచెం కొంచెం అన్ని మొక్కలకు వేసుకుంటూ రావాలి ఇలా ప్రతిసారి చేస్తే మొక్కలన్నింటికీ నీరు వస్తుంది. అదేవిధంగా బియ్యం కడుగు నీటి వల్ల మొక్కలు చాలా గుబురుగా పెరుగుతాయి.

పసుపు లేదా వేప నూనె

మొక్కలను కీటకాల నుంచి కాపాడాలంటే పసుపు లేదా వేప నూనె లేదా వేప రసం అవసరం. వీటిని 15రోజులకొకసారి నీళ్లలో కలిపి మొక్కలకు వేయాలి. అదేవిధంగా మొక్కలపై స్ర్పే చేయాలి. ఇలా చేయడం వల్ల కీటకాలు దగ్గరకు రాకుండా ఉంటాయి.

Indira Ram

Indira Ram

Next Story