Top
logo

ఆన్‌లైన్‌ అవస్థలు: ఆన్‌లైన్‌ క్లాసులతో పిల్లలను వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు

Online classes leading to stress, eye problems in children
X

ఆన్‌లైన్‌ అవస్థలు: ఆన్‌లైన్‌ క్లాసులతో పిల్లలను వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు

Highlights

*లాక్‌డౌన్‌ సెలవులతో ఇంటికే పరిమితమైన స్టూడెంట్స్ *పిల్లల అల్లరి భరించలేకపోతున్న పేరెంట్స్ *నాలుగు గోడల మధ్య ఉండలేకపోతున్న పిల్లలు *పిల్లలు షెడ్యూల్‌ని ఆగం చేసిన కరోనా

కరోనా వచ్చిరాగానే స్టూడెంట్స్ లైఫ్‌ స్టైల్‌ను మార్చేసింది. టైంకు తినడాలు లేవు. ఫ్రెండ్స్‌ను కలవాలంటే కుదరదు. ఇక ఆటల ఊసే లేదు. నాలుగు గొడల మధ్య ఆన్‌లైన్‌ క్లాసులతో కుస్తీలు పట్టాల్సిందే.. తేడా వస్తే వాతలు పడిపోతాయి. ఇది పిల్లల వర్షన్ ఇక పేరెంట్స్‌ని లాక్‌డౌన్‌ హాలీడేస్‌ హౌ ఈజ్‌ ఇట్‌ అని అడిగితే వాళ్ల ప్రస్టేషన్‌ మాములుగా లేదు. మాయదారి కరోనా అని దుమ్ముదులిపేస్తున్నారు. వేళకు తినరు. చదవరు. కుదురుగా ఉండరు. పిల్లల్ని ఎలా కంట్రోల్‌ చేయాలిరా దేవుడా అంటూ తలలపట్టుకుంటున్నారు.

ఇదీ వరకు పిల్లలు అన్నీ టైంకి చేసేవాళ్లు ఉదయాన్నే లేవగానే నీటుగా రెడీ అయి చక చక స్కూల్‌కి వెళ్లడం, తిరిగి వచ్చి, హోంవర్కులు, కాసేపు ఆటలు. వీలైతే ట్యూషన్లు అబ్బో పర్ఫెక్ట్ షెడ్యూల్‌ ఉండేది. కానీ ఇప్పుడా ఆ సీనే లేదు. ఇంట్లో ఉంటూ పేరెంట్స్‌కి చుక్కలు చూపిస్తున్నారు.

అల్లరి మాట పక్కనపడితే కనీసం వేళకు తినడం లేదని పేరెంట్స్ అంటున్నారు. ఆహారం విషయంలో పూర్తిగా కంట్రోల్‌ తప్పారని తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. ఇక క్రమశిక్షణ ఏనాడో పట్టాలు తప్పిదంటున్నారు. పైగా అన్ని ఫాస్ట్‌ఫుడ్‌ ఐటమ్స్ కోరుకుంటున్నారని కుదరదంటే మారాం చేస్తున్నారని పేరెంట్స్ వాపోతున్నారు. దీంతో పిల్లలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటు స్టూడెంట్స్ కూడా నాలుగు గోడల మధ్య నలిగిపోతున్నామని గగ్గోలు పెడుతున్నారు. ఫ్రెండ్స్ లేరు. ఆటలు లేవు. బోర్‌ లైఫ్‌ అంటూ బోరుమంటున్నారు. ఆన్‌లైన్‌ క్లాసులతో విసిగిపోయామని స్టూడెంట్స్ చెబుతున్నారు. అదే పనిగా ఫోన్‌ పట్టుకొని కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. విపరీతమైన తలనొప్పి, నడుం నొప్పి భరించలేక పోతున్నామని వాపోతున్నారు. కాసేపు రిలాక్స్ అవుదామన్నా ఆన్‌లైన్‌ టీచర్లు ఒప్పుకోవడం లేదని చెబుతున్నారు.

ఆన్‌లైన్ క్లాసులతో విసిగిపోతున్నామని విద్యార్థులు అంటున్నారు. అర్థంకాని క్లాసులు. బాడీ పెయిన్స్‌తో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. హెల్త్‌ ఇష్యూతో డాక్లర్ల వద్దకు వెళ్తే కొన్ని రోజులు మొబైల్‌ కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. కానీ క్లాసులు వినకుంటే ఎలా అని స్టూడెంట్స్ మదనపడుతున్నారు.


Web TitleOnline classes leading to stress, eye problems in children
Next Story