Heart Attack: ఈ నూనె గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది..!

Olive Oil Reduces the Risk of Heart Attack
x

Heart Attack: ఈ నూనె గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది..!

Highlights

Heart Attack: ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నూనె గుండెను సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది.

Heart Attack: ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నూనె గుండెను సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిని వాడటం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మీరు ఈ నూనెను రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. దీని కారణంగా మీ శరీరంలోని కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను సమతుల్యంగా ఉంచడం ద్వారా గుండె నొప్పి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇది కాకుండా ఆలివ్ ఆయిల్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

ఆలివ్ ఆయిల్‌లో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, పాలీఫెనాల్ సమ్మేళనాలు ఉంటాయి. ఇది గుండెకు అనేక సమస్యలతో పోరాడటానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ అర టీస్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆలివ్‌ ఆయిల్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఆలివ్ నూనె రక్తనాళాల పనితీరును, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఈ నూనెలో అధిక మొత్తంలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మెరుగైన లిపిడ్ ప్రొఫైల్‌లో సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్‌లో ఉండే పాలీఫెనాల్స్ గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఈ నూనె అధిక రక్తపోటుకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్, మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును నియంత్రిస్తాయి. ఆలివ్‌ ఆయిల్ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆలివ్ ఆయిల్ చర్మానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఈ ఉంటుంది. ఈ నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. దీన్ని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు ఒత్తుగా, దృఢంగా మారుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories