Old songs are reducing age: ఆ పాత పాటలు వయసును తగ్గిస్తాయ్.. సర్వే నివేదికలు వెల్లడి

Old songs are reducing age
x

Old songs are reducing age: ఆ పాత పాటలు వయసును తగ్గిస్తాయ్.. సర్వే నివేదికలు వెల్లడి

Highlights

Old songs are reducing age: పాటలు అంటేనే ప్రశాంతం. ఇక పాత పాటలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆ పాత మధురాలను పెట్టుకుని మరీ మీరు వింటున్నారా? అయితే మీ వయసు రోజు రోజుకూ తగ్గిపోతుందని, మీరు మళ్లీ యుక్తవయసులోకి వెళ్లిపోవచ్చని కొత్త సర్వే నివేదికలు చెబుతున్నారు.

Old songs are reducing age: పాటలు అంటేనే ప్రశాంతం. ఇక పాత పాటలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆ పాత మధురాలను పెట్టుకుని మరీ మీరు వింటున్నారా? అయితే మీ వయసు రోజు రోజుకూ తగ్గిపోతుందని, మీరు మళ్లీ యుక్తవయసులోకి వెళ్లిపోవచ్చని కొత్త సర్వే నివేదికలు చెబుతున్నారు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్తమందిని చూస్తే మూడీగా ఉన్న ప్రతిసారీ చెవులో ఇయర్ పాడ్స్ పెట్టుకుని పాటలు వింటూ ఉంటారు. ఆ తర్వాత కాసేపటికి మళ్లీ రీ ఫ్రెష్ అయి జనంలో కలుస్తుంటారు. నిజమే.. పాటలకు మూడ్‌ని రీఫ్రెష్ చేసే శక్తి ఉంది. అంతేకాదు మీకు సమయం దొరికినప్పుడలా ఆ పాత మధురాలను వింటూ ఉంటే మీరు మీ యుక్త వయసులోకి వెళ్లిపోతారని కొంతమందిపై జరిపిన పరిశోధనల్లో తెలిసింది.

కొంతమంది మధ్య వయస్కులపై జరిపిన పరిశోధనల్లో ఈ కొత్త విషయాలు తెలిసాయి. మధ్య వయసులో ఉన్నవాళ్ల చెవిలో ఇయర్ పాడ్స్ పెట్టి వారికి యుక్త వయసులో విన్న పాటలను వినిపించారు. మరికొంతమందికి ప్రస్తుత పాటలను వినిపించారు. ఇలా కొన్నాళ్ల పాటు జరిగిన పరిశోధనల్లో పాత పాటలు విన్నవారు చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అంతేకాదు వయసును పట్టించుకోకుండా వారంతా ముందుకు వెళ్లిపోయారు. కానీ ప్రస్తుత పాటలు విన్నవారు.. తమ వయసు చాలా ఎక్కువ అయిపోయిందనే ఫీలింగ్‌లోనే ఉన్నారట.

అయితే పరిశోధకులు ఏం చెబుతున్నారంటే పాత పాటలు విన్న వారి భావనలు, ఆలోచనలు వేరుగా ఉంటాయి. అదేవిధంగా ప్రస్తుత పాటలను విన్నవారి భావనలు, ఆలోచనలు వేరుగా ఉంటాయని చెబుతున్నారు. ఇటీవల షుగర్ , బీపీ ఉన్నవాళ్లు పాత పాటలను వింటే అవి తగ్గిపోతాయని చాలామంది నిపుణులు చెప్పారు. ఇప్పుడు అదేవిధంగా పాత పాటలను వినడం వల్ల వయసు చాలా వరకు తగ్గిపోతుంది. పైగా ఎనర్జీ కూడా బాగా పెరుగుతుంది. అందుకే టైం దొరికినప్పుడల్లా పక్కవాళ్ల గురించి మాట్లాడుకోకుండా అలాగే నెగిటివ్ ఆలోచనలు రాకుండా పాజిటివ్‌గా ఆలోచించడం, అదేవిధంగా మధురమైన ఆ పాత గీతాలను వింటూ ఉండాలని పరిశోధకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories