Oats Flour: ఓట్స్‌ పిండితో చేసిన చపాతీలు వీరికి దివ్యవౌషధం..!

Oat Flour Chapatis are Divine Medicine for Diabetics
x

Oats Flour: ఓట్స్‌ పిండితో చేసిన చపాతీలు వీరికి దివ్యవౌషధం..!

Highlights

Oats Flour: మనలో చాలా మంది ప్రతిరోజూ గోధుమ పిండితో చేసిన రొట్టెలని తినడానికి ఇష్టపడతారు.

Oats Flour: మనలో చాలా మంది ప్రతిరోజూ గోధుమ పిండితో చేసిన రొట్టెలని తినడానికి ఇష్టపడతారు. అయితే మన శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూర్చే ఇతర ఎంపికలు కూడా ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగినది వోట్స్ పిండి. ఇది ఆరోగ్యానికి ఉత్తమ ఎంపిక. ఎందుకంటే ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వోట్స్ ఇతర ధాన్యాల కంటే ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు. మీరు ప్రతిరోజు ఓట్స్ రోటీని తింటే అది మీకు అనేక సమస్యలలో సహాయపడుతుంది. వోట్స్ గ్లూటెన్ లేని కారణంగా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇది చాలా సమస్యలను తగ్గించే ఒక రకమైన ప్రోటీన్. ఉదరకుహర వ్యాధి ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఈ వ్యాధిని గ్లూటెన్ సెన్సిటివ్ గట్ డిసీజ్ అని పిలుస్తారు.

1. మధుమేహం

ఓట్స్ పిండిలో ఫైబర్, విటమిన్ B, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఓట్‌ఫ్లోర్ చపాతీ దివ్యౌషధం కంటే తక్కువేమి కాదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది.

2. గుండె జబ్బుల నివారణ

మధుమేహ వ్యాధి ఉన్నవారు గుండె జబ్బులు వచ్చే ప్రమాదంలో ఉంటారు. ఓట్స్‌ ఫ్లోర్‌ చపాతీని రెగ్యులర్‌ డైట్‌లో తీసుకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

3. జీర్ణక్రియ

జీర్ణవ్యవస్థలో ఎలాంటి సమస్య లేకుండా ఉంటేనే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఓట్స్ పిండి రోటీ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే దీని జీర్ణక్రియలో ఎటువంటి సమస్య ఉండదు. ఫైబర్ కారణంగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories