Beauty Tips: ఇలా చేస్తే.. ముఖంపై నల్లటి మచ్చలు మటుమాయం అంతే..!

Beauty Tips: ఇలా చేస్తే.. ముఖంపై నల్లటి మచ్చలు మటుమాయం అంతే..!
x
Highlights

Beauty Tips: ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడడం సర్వసాధారణమైన విషయం. మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

Beauty Tips: ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడడం సర్వసాధారణమైన విషయం. మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది మెలనిన్ లోపం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. ఈ కారణంగానే చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడుతాయి. దీనిని హైపర్ పిగ్మెంటేషన్ అని కూడా అంటారు. మెలనిన్ లోపం చర్మం, జుట్టు రంగును ప్రభావితం చేస్తుంది. ఏ వయస్సు వారికైనా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. కానీ వయసు పెరుగుతున్నా కొద్దీ ఇది సాధారణంగా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతకీ పిగ్మెంటేషన్‌కు కారణాలు ఏంటి? ఈ సమస్యకు నేచురల్‌గా ఎలా చెక్‌ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పిగ్మెంటేషన్‌కు కారణాలు

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కాలుష్యం తగినంత చర్మ సంరక్షణ లేకపోవడం, ఇతర ఔషధాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, ఎండవేడిలో ఎక్కువసేపు ఉండటం, రసాయనాలు కలిగిన ఉత్పత్తుల వినియోగం పెరగడం, కొన్ని సందర్భాల్లో ఎక్కువ చలిగా ఉన్న వాతావరణంలో జీవించడం వంటి కారణాల వల్ల మచ్చలు వస్తాయని స్కిన్ కేర్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇది ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. పిగ్మెంటేషన్‌ సమస్యను తగ్గించే సహజసిద్ధమైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* ఉల్లిపాయను ఎండబెట్టి పొడిగా చేయాలి. అనంతరం ఈ పొడిలో తేనె కలుపుకొని నల్ల మచ్చలున్న చోట అప్లై చేయాలి. కాసేపటి తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

* పాలలో నేచురల్ ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి మచ్చలు తగ్గించడంలో బాగా ఉపయోగపడుతాయి. దూదిని పాలలో ముంచి మచ్చలపై నెమ్మదిగా అప్లై చేయాలి. ఇలా రోజుకు 2-3 సార్లు చేస్తే మచ్చలు తగ్గిపోతాయి.

* 1 చెంచా శనగపిండి, 1 చిటికెడు పసుపు, 3-4 చుక్కల పాలను కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇది ముడతలను తగ్గించి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. పేస్ట్ ఆరిన వెంటనే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

* కలబందను చర్మంపై అప్లై చేయడం వల్ల నల్ల మచ్చలు తగ్గడమే కాకుండా చర్మం నిగారింపు పెరుగుతుంది. ఇది పిగ్మెంటేషన్ సమస్యకు చెక్‌ పెడుతుంది.

* బొప్పాయి గుజ్జు, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ తయారు చేసి, ముఖంపై అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే చర్మంపై మచ్చలు తగ్గుతాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్‌ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఈ టిప్స్‌ పాటించే ముందు చర్మ నిపుణులను సంప్రదించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories