Nail Biting Habit : గోళ్లు కొరికే అలవాటుందా? అయితే జాగ్రత్త.. ఆరోగ్యం, డబ్బు రెండూ పోతాయట

Nail Biting Habit : గోళ్లు కొరికే అలవాటుందా? అయితే జాగ్రత్త.. ఆరోగ్యం, డబ్బు రెండూ పోతాయట
x

Nail Biting Habit : గోళ్లు కొరికే అలవాటుందా? అయితే జాగ్రత్త.. ఆరోగ్యం, డబ్బు రెండూ పోతాయట

Highlights

గోరు కొరకడం అనేది పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలామందిలో కనిపించే సాధారణ అలవాటు. కానీ ఇది కేవలం ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాదు, జ్యోతిష్యం ప్రకారం ఇది మన జీవితంపై, గ్రహాలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ అలవాటు వల్ల మన శరీరంలో అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మన గోర్ల కింద, వేళ్ళ చర్మం మీద తెలియకుండానే చాలా రకాల బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు, ధూళి పేరుకుపోయి ఉంటాయి.

Nail Biting Habit : గోరు కొరకడం అనేది పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలామందిలో కనిపించే సాధారణ అలవాటు. కానీ ఇది కేవలం ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాదు, జ్యోతిష్యం ప్రకారం ఇది మన జీవితంపై, గ్రహాలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ అలవాటు వల్ల మన శరీరంలో అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మన గోర్ల కింద, వేళ్ళ చర్మం మీద తెలియకుండానే చాలా రకాల బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు, ధూళి పేరుకుపోయి ఉంటాయి. గోరు కొరికేటప్పుడు ఈ సూక్ష్మక్రిములు మన జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశించి కడుపులో ఇన్ఫెక్షన్లు, ఇతర అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అంతేకాకుండా, జ్యోతిష్యం ప్రకారం ఈ అలవాటు మన జీవితంపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపుతుందో తెలుసుకుందాం.

ఆత్మవిశ్వాసం తగ్గుతుంది

గోళ్లను నోటితో కత్తిరించడం వల్ల శరీరంలో వివిధ రకాల వ్యాధులు రావొచ్చు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గోరు కొరికే అలవాటు వ్యక్తి జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తరచుగా గోరు కొరికే అలవాటు ఉన్నవారి సూర్య గ్రహం బలహీనమవుతుంది. దీని ఫలితంగా వారి జీవితంలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. వృత్తి జీవితంలో అడ్డంకులు ఎదురవుతాయి. అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునే వారి సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.

డబ్బు కొరత, ఆర్థిక సంక్షోభం

జ్యోతిష్యం ప్రకారం.. గోరు కొరికే అలవాటు శని దోషానికి సంకేతం. ఈ అలవాటు వల్ల శని దృష్టి మీపై పడుతుంది. ఇది జీవితంలో చాలా సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు, ఈ అలవాటు వల్ల ప్రజలు జీవితంలో డబ్బు కొరత, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అలవాటును వెంటనే మానుకోవడం మంచిది.

ఈ అలవాటును ఎలా ఆపాలి?

గోరు కొరికే అలవాటును మానుకోవడానికి క్రమం తప్పకుండా గోళ్లను కత్తిరించుకోవాలి. మార్కెట్‌లో చేదు రుచి ఉన్న ప్రత్యేకమైన నెయిల్ పాలిష్ లభిస్తుంది. అది రాసుకోవడం వల్ల గోరు కొరికే అలవాటు తగ్గుతుంది. సాధారణంగా ఒత్తిడి లేదా ఆందోళనలో ఉన్నప్పుడు చాలామంది గోరు కొరుకుతారు. కాబట్టి వీటిని నియంత్రించడానికి యోగా, ధ్యానం చేయడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories