Top
logo

Moringa Leaves: ఒంట్లో కొవ్వు.. మునగాకుతో బయటకు నెట్టు!

Can Moringa Leaves Benefits to Check for Belly Fat
X

ఇమేజ్ సోర్స్: statetv

Highlights

Moringa Leaves: మునగ ఆకు బెల్లీ ఫ్యాట్‌ను, రక్తంలో చక్కెరను నియంత్రించి శరీరంలో కొవ్వును బయటకు పంపుతుంది.

Can Moringa Leaves: దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. ఈ చెట్లు ఉపయోగాలు ఎన్నో..ఎన్నెన్నో.. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. ఆకులే కాదు వాటి పువ్వల్లో కూడా మంచి ఔషధ గుణాలు కలిగి వున్నాయ. మునగ శాస్ర్తీయ నామం 'మొరింగ బలిఫెర' ఇది మొరింగేసి కుటుంబంలోనిది. విశేషమైన పోషకాలున్న చెట్టుగా ఇది ప్రసిద్ధి కూడా. 5000 సంవత్సరాల క్రితమే ఇది వాడుకలో వున్నట్లు తెలుస్తోంది. మునక్కాయలు అంటే దక్షిణాది తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో...

సాధారణంగా మునగ అనగానే మనకు గుర్తుకు వచ్చేది మునక్కాయలు. వీటిని అందరూ ఇష్టంగా లాంగించేస్తారు. మునక్కాయలే కాకుండా ఆకుల్లోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. మునగాకులో అనేక విసమిన్లు, మినరల్స్ వున్నాయి. అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి. అసలు 4, 5 వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. ఆయుర్వేదంలో 300లకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు.

  • ఆరోగ్యంతోపాటు అధిక బరువును తగ్గించి, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో మునగాకులు సహాయపడతాయి. అధిక మొత్తంలో పోషకాలు లభించే ఆహార పదార్థాల్లో మునగాకులు ముందు స్థానంలో ఉంటాయి. మునగ ఆకు బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడమే కాదు, రక్తంలో చక్కెరను కూడా నియంత్రిస్తుంది. రక్తంలోని అధిక చక్కెరలను నియంత్రించి శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును బయటకు పంపుతుంది.
  • పెద్ద పేగులను కూడా శుభ్రం చేసి శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచి జీవక్రియలను ఉత్తేజితం చేస్తుంది. మునగ ఆకులో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వాపును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. రక్తంలో చక్కెర, కొవ్వులను నియంత్రించి గుండె పనితీరు మెరుగుపరుస్తుంది. కాలేయం, మెదడు ఆరోగ్యానికి కూడా సహకరిస్తుంది. నిమ్మ జాతి పండ్ల కంటే మునగాకులో విటమిన్ సి ఏడు రెట్లు అధికంగా ఉంటుంది. పొటాషియం అరటి పళ్లలో కంటే 15 రెట్లు ఎక్కువగా ఈ ఆకులో ఉంటాయి. ప్రొటీన్లు, విటమిన్ ఎ, కాల్షియం కూడా మునగాకుల్లో విరివిగా లభిస్తాయి.
  • రక్తపోటును నియంత్రించి, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్, గౌట్స్ లాంటి వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. అంతే కాదు చర్మంలోని మృత‌ కణాలను తొలగించి మృదువుగా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. హార్మోన్ల సమతౌల్యతను కాపాడి, కండరాల వాపు తగ్గించి, మంచి కొవ్వును అందిస్తుంది. అలెర్జీ, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కేన్సర్ కణాలతో పోరాడి ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార, అండాశయ కేన్సర్లను నిరోధిస్తుంది. మెదడును కూడా చురుకుగా ఉంచుతుంది. శరీరంలో నీటి సాంద్రతను సమతాస్థితిలో ఉంచుతుంది.
  • ఇందులో ఉండే కాల్షియంతో ఎముకలు బలంగా తయారవుతాయి. బాలింతలు తీసుకుంటే తల్లిపాలు పిల్లలకు పుష్కలంగా అందుతాయి. థైరాయిడ్ సమస్యలను కూడా నివారిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ చర్యలను అదుపులో ఉంచుతుంది. దీనిలో అధిక మొత్తంలో ఉండే ప్రొటీన్లు, పీచుపదార్థాలు, క్యాల్షియం, తక్కువ పరిమాణంలో కొవ్వు శరీరానికి సహజమైన శక్తిని అందిస్తాయి. శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలోమునగాకు రసం సాయపడుతుంది. దీని వల్ల లివర్ పనితీరు సక్రమంగా ఉంటుంది.
  • రేచీక‌టి, కంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వాళ్లు క్యారెట్ ఎక్కువ‌గా తింటూ ఉంటారు. దీనితోపాటు మున‌గాకు ర‌సంలో కొంచెం తేనె వేసుకొని బాగా క‌లుపుకోవాలి. ప్ర‌తిరోజూ ప‌‌డుకునే ముందు ఈ రసాన్ని తాగితే రేచీక‌టి త‌గ్గ‌డంతోపాటు, జ్ఙాప‌క‌శ‌క్తి పెర‌గుతుంది.
  • మున‌గ పువ్వుల‌ను సేక‌రించి వాటి ర‌సం తీసుకోవాలి. ఒక స్పూన్ మున‌గ పువ్వు రసంలో గ్లాస్ మ‌జ్జిగ క‌లిపి తాగాలి. ఈ ఔష‌ధాన్ని త‌ర‌చూ తాగ‌డం వ‌ల్ల అజీర్తి, ఉబ్బ‌సం నుంచి ఉప‌శ‌మ‌నాన్నిస్తుంది.
  • మూత్ర‌పిండాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు మున‌గాకు ర‌సంలో కొద్దిగ లేతకొబ్బ‌రి నీరు పోసి క‌లిపి తాగితే మంచి ఫ‌లితం ఉంటుంది.
Web TitleMoringa Leaves (Drumstick) Reduce Belly Fat and Control Blood Sugar Levels
Next Story