Monsoon Health Tips: వర్షకాలంలో ఆరోగ్యం జాగ్రత్త..!

Monsoon Health Tips: వర్షకాలంలో ఆరోగ్యం జాగ్రత్త..!
x

Monsoon Health Tips: వర్షకాలంలో ఆరోగ్యం జాగ్రత్త..!

Highlights

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ఉన్నట్టుండి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇలా వర్షాలు పడే సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే లేనిపోని రోగాలు వచ్చే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ఉన్నట్టుండి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇలా వర్షాలు పడే సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే లేనిపోని రోగాలు వచ్చే అవకాశం ఉంది. వర్షాలు పడే సీజన్‌లో హెల్త్ కేర్ ఎలా ఉండాలంటే..

ఎండాకాలం పోయి వానాకాలం మొదలవగానే పర్యావరణంలో తేమ పెరుగుతుంది. దీనివల్ల ముందుగా నీళ్లు కలుషితమవుతాయి. కాబట్టి ఈ సీజన్‌లో తాగే నీటి విషయంలో శ్రద్ధ వహించాలి.

వాతావరణం మారగానే తేమ వలన జలుబు, దగ్గు, ఎలర్జీల వంటివి మొదలవుతాయి. కాబట్టి వర్షాలు పడే రోజుల్లో వేడి నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు వానకు తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వర్షాల రాకతో దోమలు కూడా ఎంట్రీ ఇస్తాయి. ఈ సీజన్‌లో కుట్టే దోమల వల్ల జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇళ్లలోకి దోమలు రాకుండా జాగ్రత్త పడాలి.

వర్షాకాలంలో బయటి నుంచి తెచ్చిన పండ్లు, కూరగాయలను ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. అలాగే రోడ్ సైడ్ ఫుడ్‌ జోలికి వెళ్లకపోవడమే మంచిది.

ఇంటి చుట్టుపక్కల నీళ్లు నిల్వ ఉండకుండా పరిసరాలు చెక్ చేసుకోవాలి. వర్షపు నీరు ఎక్కడైనా నిల్వ ఉందంటే వెంటనే అక్కడ దోమలు వచ్చి చేరే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సీజన్‌లో పరిసరాలు శుభ్రంగా ఉంచకోవడం చాలా ముఖ్యం.

ఇకపోతే ఈ సీజన్‌లో ఉండే నీటి కాలుష్యం వల్ల బ్యాక్టీరియాల ద్వారా సోకే జ్వరాలు, డయేరియా, కామెర్ల వంటి రోగాలు పెరుగుతాయి. హెప‌టైటిస్ ఏ, హెప‌టైటిస్ ఈ వంటి వ్యాధులు వ‌చ్చే సీజన్ కూడా ఇదే. కాబట్టి ఈ సీజన్‌లో పరిశుభ్రత పాటిస్తూ తాజా ఆహారం తీసుకుంటుండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories