Monsoon Health Care: వర్షాకాలంలో ఈ కూరగాయలు తింటున్నారా? అయితే మీరు త్వరలో హాస్పటల్‌కు వెళ్లాల్సిందే

Monsoon Health Care
x

Monsoon Health Care: వర్షాకాలంలో ఈ కూరగాయలు తింటున్నారా? అయితే మీరు త్వరలో హాస్పటల్‌కు వెళ్లాల్సిందే

Highlights

Monsoon Health Care: ప్రతిరోజూ తినే ఆహారంలో కూరగాయలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి అంటూ ఆరోగ్య నిపుణుల నిత్యం మనకు చెబుతూనే ఉంటారు.

Monsoon Health Care: ప్రతిరోజూ తినే ఆహారంలో కూరగాయలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి అంటూ ఆరోగ్య నిపుణుల నిత్యం మనకు చెబుతూనే ఉంటారు. ఎందుకంటే తాజా కూరగాయల్లో అవసరమైన విటమిన్లు, మినరళ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కూరగాయలను రెగ్యులర్ తీసుకుంటే కొన్ని రకాల వ్యాధుల నుండి దూరంగా ఉండొచ్చు. అయితే వర్షాకాలంలో మాత్రం ఈ కూరగాయల జోలికి వెళ్లకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ కూరగాయలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయ

ఈ సీజన్‌లో వంకాయల్లో ఎక్కువగా పురుగులు పడతాయి. కాబట్టి ఈ సీజన్‌లో వీటిని తినకుండా ఉంటేనే మంచిది. చాలామంది వంకాయలో పురుగులు ఉంటే సగం కట్ చేసి సగం వండుతుంటారు. ఇలా చేయడం వల్ల కడుపులోకి నులు పురుగులు చేరిపోతాయి. ఎందుకంటే వాటి లార్వా ఇంకా బతికే ఉంటుంది. దీనివల్ల కడుపులో అవి పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది మెదడులోకి ప్రవేశిస్తే చాలా ప్రమాదం కూడా.

కాలీఫ్లవర్

కాలీఫ్లవర్‌‌లో కూడా చాలా పురుగులు ఉంటాయి. ఎంత క్లీన్ చేసినా.. అందులో పురుగులు ఇంకా బతికే ఉంటాయి. ఈ కాలంలో అయితే మరింత ఎక్కువగా కాలీఫ్లవర్‌‌లో పురుగులు ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో అసలు కాలీఫ్లవర్ తినకూడదు. ఒక వేళ తింటే.. కడుపులో నొప్పి, తలనొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.

బీరకాయ

వర్షాకాలంలో బీరకాయకు దూరంగా ఉండాలి. అయితే ఇవి ఈ కాలంలో ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి అందరూ వాటిని తింటుంటారు. కానీ ఈ కాలంలోనే వీటికి దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే బీరకాయలో ఉండే ఎవరికీ కనిపించవు. అవిచాలా సూక్ష్మమైన పురుగులు. ఒకవేళ ఇవి కడుపులోకి వెళ్లిపోతే చాలా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

క్యాప్సికమ్

సలాడ్‌లో ఎక్కువగా వాడే కూరగాయ క్యాప్సికమ్. దీన్ని కడుగుతారే కానీ వండరు. దీనివల్ల ఇందులో ఉండే టేప్ వార్మ్ గుడ్లు నేరుగా శరీరంలోకి వెళ్లిపోతాయి. అందుకే శుభ్రం చేసేటప్పుడు ఉప్పు నీళ్లలో వీటిని అరగంటపాటు నానబెట్టి అప్పుడు తినాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో వీటికి దూరంగా ఉండటమే మంచిది.

క్యాబేజీ

క్యాబేజీ పొరల మధ్య టేప్ వార్మ్‌ లు దాక్కుని ఉంటాయి. వాటిని ఎంత క్లీన్ చేసినా అవి శుభ్రం కావు. ఈ కాలంలో ఇందులో పురుగులు చాలా వేగంగా పెరుగుతాయి. అందుకే ఈ కాలంలో దీనికి దూరంగా ఉండాలి.

ఒకవేళ ఇందులో ఏ కూరగాయలు తినాలన్నా.. వాటిని ముందుగా ఉప్పువేసి నీళ్లలో ఉడికించిన తర్వాత వాటిని వండి తినాలని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories