Mind relaxation techniques: మీ మైండ్‌ ప్రశాంతంగా ఉండటం లేదా? అయితే ఇలా రిలాక్స్ అవ్వండి

Mind relaxation techniques
x

Mind relaxation techniques: మీ మైండ్‌ ప్రశాంతంగా ఉండటం లేదా? అయితే ఇలా రిలాక్స్ అవ్వండి

Highlights

Mind relaxation techniques: ఉరుకులు పరుగుల జీవన శైలి. కూర్చునే టైం ఉండదు. అలాఅని పని చేయకపోతే ఇల్లు గడవదు. ఇప్పుడు ఎవర్ని చూసినా ఇదే పరిస్థితి. దీంతో మైండ్‌ ప్రశాంతకంగా ఉండదు.

Mind relaxation techniques: ఉరుకులు పరుగుల జీవన శైలి. కూర్చునే టైం ఉండదు. అలాఅని పని చేయకపోతే ఇల్లు గడవదు. ఇప్పుడు ఎవర్ని చూసినా ఇదే పరిస్థితి. దీంతో మైండ్‌ ప్రశాంతకంగా ఉండదు. దీనివల్ల మానసికమైన ఆరోగ్య సమస్యలే కాదు.. శారీరక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు. మైండ్ ప్రశాంతంగా ఉండేందుకు ఎవరికి వారే ప్రయత్నించాలని చెబుతున్నారు. డాక్టర్లు ఇంకా ఏం చెబుతున్నారంటే..

మైండ్ ప్రశాంతంగా లేకపోతే చికాకు, కోపం, అలసట, విసుగు.. ఇలాంటివన్నీ వస్తుంటాయి. దీనివల్ల రిలేషన్స్ దెబ్బతింటారు. పనులు కూడా సక్రమంగా చేయలేరు. దీంతో బాస్‌లతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రోజూ చేసే పనులే అయినా ఈ సమస్యలు ఉండటం వల్ల ఆ పనులకు రోజు సరిపోదు. ముఖ్యంగా ఆడవాళ్లలో ఇలా జరుగుతు ఉంటుంది. అయితే దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే.. పనుల ఒత్తిడి. దాంతో పాటు మైండ్ రిలాక్సేషన్ కోసం మీరు ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం. అయితే పనులు ఒత్తడి తగ్గాలంటే మీ మైండ్ మొదట ప్రశాంతంగా ఉండాలి. దానికోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అతిగా ఆలోచిస్తే..

అవును.. అతిగా ఆలోచిస్తే అన్నీ అనర్ధాలే. సమస్యలున్నాయని చాలామంది తెగ ఆలోచించేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మెదడుపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఇదే అన్నింటికీ కారణం అవుతుంది. కాబట్టి సమస్యలున్నా అతిగా ఆలోచించకూడదు. ఆలోచించడానికి ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి. ఆ టైంలో దాని గురించి ఆలోచించి, వచ్చిన పరిష్కారాన్ని ఒక పేపర్‌‌పై రాసి, అక్కడతో దాన్ని వదిలేయాలి. ఒకవేళ ఆ రోజు పరిష్కారం దొరక్కపోతే మరుసటి రోజు అదే టైంకి కూర్చుని ఆలోచించాలి. దీనివల్ల మెదడుపై ప్రెషర్ తగ్గుతుంది.

ఒప్పుకుని తీరాలి..

మంచి జరిగినా.. చెడు జరిగినా.. అన్నింటినీ మనం ఒప్పుకుని తీరాలి. జరిగినది అంటేనే..అది జరిగిపోయిందని అర్ధం. దాన్ని మార్చడం ఎవరి వల్లా కాదు. కాబట్టి జరగాల్సినది ఆలోచించాలి. కొంతమంది పిల్లలు ఏమైనా తప్పు చేస్తే ఇలా ఎందుకు చేసావ్ అని ప్రశ్నిస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఇన్ని నష్టాలు వచ్చాయి లేదా వస్తాయి అన్న విషయాన్ని పిల్లలకు తెలియజేయాలి. అంతేకాదు ఇలా జరగిపోయిందే అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోకూడదు. ప్రతి విషయాన్ని ఒప్పుకోవడం వల్ల మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు సమస్యకు పరిష్కారం ఈజీగా దొరుకుతుంది.

అడవి ప్రాంతంలో వాక్ చేయడం

జపాన్‌లో కొంతమంది రిలాక్సేషన్ అవ్వడానికి ఇలా ఫారెస్ట్ వాక్ చేస్తుంటారంట. అయితే జంతువులు, భయానకమైన వాతావరణం ఉన్న చోట కాదు. అలాంటి పార్కులు ఉన్న చోట. అంటే పెద్ద పెద్ద పార్కుల్లో వాకింగ్ లు చేస్తే మైండ్ చాలా రిలాక్సేషన్‌గా ఉంటుంది.

మెడిటేషన్

మైండ్ రిలాక్సేషన్‌కు మెడిటేషనే బెస్ట్ మెడిసిన్. ఒక పదినిమిషాల పాటు ఎవరిగురించి ఆలోచించకుండా దేన్ని గురించి ఆలోచించకుండా.. ప్రశాంతంగా కూర్చోవాలి. ఇది ఉదయాన్నే 5 గంటలకు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రోజంగా మీరు ప్రశాతంగా ఉంటారు.

డైవర్ట్ కావడమే మంచిది

ఏ విషయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందే దాన్ని నుండి బయటపడాలి. దీనికోసం మీరు డైవర్ట్ కావాలి. అంటే అక్కడ నుంచి తప్పుకోవాలి. ఉదాహరణకు ఎవరితోనైనా మీకు సమస్యగా ఉంటే వారితో కొన్ని రోజుల పాటు దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఆలోచించండి. మళ్లీ మీరే వచ్చి వాళ్లతో కలిసి ఉంటారు. ఇలా అప్పుడప్పుడు మీకోసం కొన్ని రోజులు తీసుకుంటే మీ లైఫ్‌ ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories