Hair Loss: పురుషులకి అలర్ట్‌.. బట్టతల కావొద్దంటే ఇవి పాటించాల్సిందే..!

Men Should Follow These Simple Steps to Prevent Hair Fall
x

Hair Loss: పురుషులకి అలర్ట్‌.. బట్టతల కావొద్దంటే ఇవి పాటించాల్సిందే..!

Highlights

Hair Loss: జుట్టు రాలడం వల్ల మహిళలు మాత్రమే ఇబ్బంది పడతారని అనుకుంటారు.

Hair Loss: జుట్టు రాలడం వల్ల మహిళలు మాత్రమే ఇబ్బంది పడతారని అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో పురుషులు కూడా ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు. సరైన ఆహారం, ఒత్తిడి కారణంగా జుట్టు విపరీతంగా రాలి బట్టతలకి గురవుతున్నారు. దీనిని నివారించడానికి పురుషులు చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఎటువంటి ఫలితం ఉండటం లేదు. ఈ పరిస్థితిలో మీరు కొన్ని చిట్కాలని పాటించడం ద్వారా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

మీ జుట్టు నిరంతరం రాలుతూ ఉంటే మీరు పుదీన నూనెను ఉపయోగించవచ్చు. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. పెప్పర్ మింట్ ఆయిల్ స్కాల్ప్‌లో రక్త ప్రసరణను వేగవంతం చేయడానికి పనిచేస్తుంది. అంతే కాదు ఇది జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఇది కాకుండా పురుషులు కొబ్బరి నూనె, ఆలివ్ నూనెను కూడా వాడవచ్చు.

జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ రసం కూడా చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ అని చెప్పవచ్చు. ఉల్లిపాయ రసాన్ని వెంట్రుకల మూలాలపై రాసుకోవడం వల్ల ఫోలికల్స్ బలంగా తయారవుతాయి. దీంతో జుట్టు రాలడం ఆగిపోతుంది. అంతే కాదు కొత్త జుట్టు పెరగడానికి ఉల్లిపాయ రసం సహాయపడుతుంది.

పురుషుల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఒత్తిడి. మీ జుట్టు రాలుతున్నట్లయితే ఒత్తిడిని తగ్గించుకోండి. దీనికోసం రోజూ వ్యాయామం చేయండి. మంచి నిద్రను పొందడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. సంగీతం వినడం, ఆటలు ఆడటం ద్వారా కూడా ఒత్తిడిని జయించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories