ఇలా చేస్తే చాలు ప్రశాంతమైన జీవితం మీ సొంతం

ఇలా చేస్తే చాలు ప్రశాంతమైన జీవితం మీ సొంతం
x
Highlights

ఇప్పటి బిజీ జీవితంలో చాలా మందికి ఒత్తిడి సాధారణమైపోయింది. చివరకు ఈ సమస్య పలువురిలో మానసిక సమస్యలకు కారణమవుతుంది. చిన్న సమస్యలకు కూడా మానసికంగా...

ఇప్పటి బిజీ జీవితంలో చాలా మందికి ఒత్తిడి సాధారణమైపోయింది. చివరకు ఈ సమస్య పలువురిలో మానసిక సమస్యలకు కారణమవుతుంది. చిన్న సమస్యలకు కూడా మానసికంగా కుంగిపోతున్నారు. ఇవే అనేక జబ్బులకు కేంద్రమౌతున్నాయి. ఒత్తిడులను దూరం చేసుకోవడానికి ధ్యానం చేయడం చాలా సులభమైన పద్దతి. మన చుట్టూ కలుషితమైన వాతావరణం, సెల్‌ఫోన్‌ల సంభాషణలు, కోర్కెలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఇవి మానసిక కుంగిబాటుకు కారణం మవుతున్నాయి.

ఓత్తడి కారణంగా తనలోని అంతర్నిహిత శక్తిని వృధా చేసుకుంటున్నాడు. అతికొద్ది శ్రమతోనే నీరసించిపోతున్నాడు. అయితే శక్తిని తిరిగిపొందడానికి ధ్యానం ఒక్కటే మార్గమని ఆధ్యాత్మిక గురువులు పేర్కొంటున్నారు. ధ్యానం వల్ల నిశబ్ధం ఆవహిస్తుంది. ఈ మౌనంలో అనేక శక్తులు దాగున్నాయి. వాక్ శక్తి, మానసిక శక్తి కేంద్రీకృతమైవున్నాయి. మౌనం వలన ఏకాగ్రతా శక్తి పెరిగుతుంది.మౌనం, ధ్యానం ద్వారా శారీరక బలం, ఆధ్యాత్మిక శక్తులను సంపాదించవచ్చు. దృష్టిని కేంద్రీకరిచడం ద్వారా ప్రపంచంలో సైతం శాంతిని నెలకొల్పవచ్చు.

ప్రశాంత వల్ల చేసే పనుల్లో విశ్వాసం కలుగుతుంది. అలాగే మృదుమధురంగా పలికే శక్తి లభిస్తుంది. శరీరంలో ప్రతి అవయవాన్ని విచ్ఛలవిడిగా పోనివ్వకుండా ద్యానం చేయడం వల్ల కేంద్రికరించుకోవచ్చు. మోడిటేషన్ వల్ల శక్తివంతమైన ఫలితాలు చేకూరుతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories