Mango Panipuri: మ్యాంగో పానీపూరీ.. కొత్త కాంబినేషన్ గురూ..

Mango Panipuri: మ్యాంగో పానీపూరీ.. కొత్త కాంబినేషన్ గురూ..

Jyothi
Updated on: 26 April 2023 9:30 PM IST
Mango Pani Puri Combination Trending On Social Media
X

Mango Panipuri: మ్యాంగో పానీపూరీ.. కొత్త కాంబినేషన్ గురూ..

Mango Panipuri: పానీపూరి అంటే చాలు చాలా మందికి నోరు ఊరుతుంది. సమయం, సీజన్ తో సంబంధం లేకుండా లొట్టలేసుకొని తినేస్తారు. ముఖ్యంగా యూత్ అయితే మరీనూ. అందుకే స్కూల్స్, కాలేజీలు, హాస్టళ్లు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పానీపూరి బండ్లు పుట్టగొడుగుల్లా కనిపిస్తాయి. గల్లీ గల్లీకి పానీపూరి షాపులు పెరిగిపోయాయి.

పానీపూరి అంటే అన్ని చోట్లా ఒకేలా ఉంటుంది. పానీపూరీలో వేడి వేడి చాట్ మసాలా, పుదీనా ఫ్లేవర్, గ్రీన్ వాటర్, ఉల్లిగడ్డ, కొంచెం పెరుగు ఇలాంటి పదార్థాలను కలిపి సర్వ్ చేస్తారు. అయితే అన్నీ ఒకేలా ఉంటే ఆహార ప్రియులను ఆకట్టుకోవడం కష్టం కదా..అందుకే చాలామంది కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి నాన్ వెజ్ పానీపూరీకి రూపకల్పన చేశాడు. పూరీలో నీటికి బదులు చికెన్ తో ఉడికించిన గ్రేవీ వేస్తున్నాడు. మరింత రుచి కోసం పలు రకాల ఫ్లేవర్లు, కొత్తిమీరతో కలిపి విభిన్నంగా సర్వ్ చేస్తున్నాడు.

వెరైటీ కోసం కొందరు జున్ను, సబ్జీతో కూడా పానీపూరీ తయారు చేస్తున్నారు. మరికొందరు ఐస్ క్రీమ్ పానీపూరీ సర్వ్ చేస్తున్నారు. ఇలా వెరైటీగా సర్వ్ చేయాలనే ఆలోచన రావడంతో వివిధ కాంబినేషన్లతో పానీపూరీని తయారు చేసి ఆహారప్రియులు ముందుపెడుతున్నారు. ఇదంతా ఒకెత్తైతే తాజాగా ఓ వ్యాపారి మ్యాంగో పానీపూరీ అంటూ అమ్మేస్తున్నాడు.

పానీపూరీలో మ్యాంగో జ్యూస్ కలిపి సర్వ్ చేసేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోని @bombayfoodie-tales అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశాడు. ఒక ప్లేట్ లోకి పూరీలను తీసుకొని దానికి చోలే మిక్స్ ని కలిపి ఆ తర్వాత తీసిపెట్టుకున్న మ్యాంగో జ్యూస్ ని పానీపూరీపై పోసి వ్యాపారి అమ్మేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారంది. కొంతమంది ఈ కాంబినేషన్ భలేగా ఉంది అంటుంటే మరికొందరు మాత్రం ఇలాంటి కాంబినేషన్లు ఆరోగ్యానికి హానికరమంటున్నారు. వ్యాపారం పెంచుకునేందుకు కొత్త కొత్త కాంబినేషన్లను జనం ముందుకు తెస్తున్నారని..అయితే అవి ఎంతవరకు సేఫ్ అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అంటున్నారు.


Jyothi

Jyothi

Next Story