బెల్లం, నిమ్మకాయ మిక్స్‌డ్‌ డ్రింక్‌తో సులువుగా బరువు తగ్గొచ్చు..! ఎలాగంటే..

Loss weight Easily with Jaggery and Lemon Mixed Drink
x

బెల్లం లెమన్ వాటర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Weight Loss: ఆధునిక కాలంలో చాలామంది అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నారు

Weight Loss: ఆధునిక కాలంలో చాలామంది అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నారు. శ్రమలేకపోవడంతో కేలరీలు కరగక శరీరంలో కొవ్వుగా పేరుకుపోతున్నాయి. దీంతో స్థూలకాయంతో పాటు అధికంగా బరువు పెరుగుతున్నారు. దీనికి తోడు కరోనా రావడంతో చాలామంది వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. ఇంట్లోనే ఉండటంతో తిండికి డోకా ఉండదు. దీంతో విపరీతంగా బరువు పెరుగుతున్నారు. అయితే బరువు పెరగడం సులువే కానీ తగ్గడమే కష్టం. అందుకే బరువు తగ్గాలని ప్రయత్నించేవారు ఈ ఒక్క డ్రింక్‌ తాగితే అధ్భుత ఫలితాలను చూస్తారు. అదేంటో తెలుసుకుందాం.

బెల్లం లెమన్ డిటాక్స్ వాటర్

చలికాలం వచ్చింది కాబట్టి బెల్లం వినియోగం పెరుగుతుంది. ఊపిరితిత్తులను శుభ్రపరచడమే కాకుండా బెల్లం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, శరీరాన్ని శుభ్రపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మరోవైపు, నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ నాణ్యతను మెరుగుపరుస్తుంది. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. ఇవన్నీ సులభంగా బరువు నిర్వహణకు సహాయపడతాయి.

బెల్లం నిమ్మరసం ఎలా తయారు చేయాలి?

పానీయం చేయడానికి 2-అంగుళాల బెల్లం తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. ఐదు నిమిషాల తర్వాత నీటిని వడకట్టి గది ఉష్ణోగ్రతకు చల్లబరచండి. ఇప్పుడు దానికి ఒక టేబుల్ స్పూన్ని మ్మరసం కలిపి తాగాలి. ఈ పానీయం జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. పొట్టలోని కొవ్వును వేగంగా కరిగిస్తుంది. చర్మ సమస్యలకు చక్కటి పరిష్కారం. ఇది జీర్ణవ్యవస్థను, శ్వాసకోశ వ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories