Health Tips: ఈ డైట్‌ పాటిస్తే వారం రోజుల్లో బరువు తగ్గొచ్చు.. ఎలాగంటే..?

Lose Weight in 7 Days With This Diet Plan Learn the Diet Chart Throughout the day
x

Health Tips: ఈ డైట్‌ పాటిస్తే వారం రోజుల్లో బరువు తగ్గొచ్చు.. ఎలాగంటే..?

Highlights

Health Tips: ఈ రోజుల్లో బరువు తగ్గడం ఎంత కష్టమో అందరికి తెలిసిందే.

Health Tips: ఈ రోజుల్లో బరువు తగ్గడం ఎంత కష్టమో అందరికి తెలిసిందే. ఎందుకంటే శారీరక శ్రమ తగ్గడం, మరోవైపు కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల చాలామంది ఊబకాయం బారిన పడుతున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత స్త్రీల బరువు వేగంగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో వ్యాయామం ఒక్కటే సరిపోదు. ఇందుకోసం సరైన ఆహారం తీసుకోవాలి. సరైన డైట్ పాటిస్తే వారం రోజుల్లో బరువు తగ్గొచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

మార్నింగ్ వాటర్

మీరు ఉదయమే వేడి నీటితో రోజుని ప్రారంభించాలి. మామూలు నీళ్లకు బదులు నిమ్మకాయ నీటిని తాగితే సులువుగా ఫ్యాట్‌ కరుగుతుంది.

అరగంట తర్వాత

మీరు డిటాక్స్ వాటర్ తాగిన తర్వాత 7.30 నుంచి 8 మధ్య నానబెట్టిన 4-5 బాదంపప్పులను తినాలి.

అల్పాహారం

బరువు తగ్గడానికి అల్పాహారంగా 2 ఇడ్లీలు లేదా 2 సాధారణ గోధుమ రోటీలు తీసుకోవచ్చు. అంతేకాదు ఏదైనా సీజనల్ పండ్లు లేదా కూరగాయలను తీసుకోవచ్చు.

మధ్యాహ్న సమయం

11 గంటల ప్రాంతంలో 1 గ్లాసు మజ్జిగ తాగవచ్చు. మజ్జిగ తాగకపోతే 100 గ్రాముల బొప్పాయి లేదా పుచ్చకాయ తినవచ్చు.

మధ్యాహ్న భోజనం

మీరు 1.30 గంటలకు భోజనం చేయాలి. మధ్యాహ్న భోజనంలో రాగి ఇడ్లీ, సాంబారు తీసుకోవచ్చు. అవసరమైతే ఉప్మా, కూరగాయలను చేర్చండి. మీరు రోజుకు 2 రోటీలు, కూరగాయలు, అర కప్పు పప్పు తినవచ్చు.

లంచ్ తర్వాత

లంచ్ తర్వాత 4 గంటలకు మీరు గ్రీన్ టీ తాగాలి. ఇది కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీలో చక్కెర కలుపవద్దు.

రాత్రి భోజనం

రాత్రి భోజనం చాలా తేలికగా ఉండాలి. 7.30 నుంచి 8 గంటల మధ్య రాత్రి భోజనం చేయాలి. బ్రౌన్ రైస్, కూరగాయలు రాత్రి భోజనంలో తీసుకోవచ్చు. నిద్రపోయే ముందు 1/2 గ్లాసు పసుపు పాలు తాగితే మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories