పదికాలాలపాటు గుండె పదిలంగా ఉండాలంటే..

పదికాలాలపాటు గుండె పదిలంగా ఉండాలంటే..
x
Highlights

ఈ కాలంలో గుండే నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. వృత్తి పరమైన జీవితంలో బిజీగా ఉంటూ వ్యాయామం చేయకపోవడంతో గుండెనొప్పికి...

ఈ కాలంలో గుండే నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. వృత్తి పరమైన జీవితంలో బిజీగా ఉంటూ వ్యాయామం చేయకపోవడంతో గుండెనొప్పికి కారణమవుతుంది. అయితే గుండె నొప్పి రాకుండా ఏం చెయ్యాలో ఓ సారి తెలుసుకుందాం.

తెల్లని మిరియాల పోడిని ఓ గ్లాస్ నీళ్ళలో కలుపుకుని రోజూ త్రాగితే గుండె జబ్బులు రావు. అలాగే మల్లెపూలతో చేసిన టీ రక్తపోటును నివారిస్తుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. రోజూ ద్రాక్ష తినడం వల్ల గుండె బలంగా ఉంటుంది. అంజూరపు పళ్ళను జీలకర్రతో కలిపి పొడి చేసుకొని తేనెలో కలిపి రోజూ తీసుకొంటే గుండెదడ, గుండెపోటు వంటివి ఉండవు.

చింతచిగురు గుండెకు బలాన్ని ఇస్తుంది. వాటిని రోజు తినే కూరలలో వేసుకొని కానీ పొడి చేసుకొని కానీ తింటే చాలా మంచిది. అంతేకాక మరో అద్భుత చిట్కా ఏటంటే చిటికెడు కుంకుమ పువ్వును కొంచెం నిమ్మరసంలో కలిపి తీసుకుంటే గుండె బలంగా ఉంటుంది. దానిమ్మ గింజలు, వాటి ఆకుల రసం గుండె జబ్బులను నివారిస్తుంది.ఉసిరికాయ పొడిలో చెంచా తేనె కలిపి ప్రతి రోజూ తీసుకొవడం వల్ల గుండె జబ్బులు దరి చేరవు. వెల్లుల్లి దెబ్బలను నేతిలో వేయించి రోజూ మధ్యాహ్న భోజనానికి ముందు తింటే గుండె దృఢంగా తయారవుతుంది. ఇలాంటి చిట్కాలు పాటించడం ద్వారా గుండె బలంగా ఉంటుంది. అనారోగ్యాలు దరిచేవు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories