Lemon Water: పరగడుపున నిమ్మకాయ నీళ్లు తాగితే మంచిదా? కాదా?

Lemon Water
x

Lemon Water: పరగడుపున నిమ్మకాయ నీళ్లు తాగితే మంచిదా? కాదా?

Highlights

Lemon Water: చాలామంది ఉదయం లేవగానే నీళ్లలో నిమ్మకాయ రసం కలుపుకుని తాగేస్తూ ఉంటారు. వాళ్లని ఎవరైనా అడిగితే ఆరోగ్యానికి చాలామంచిది. మీరూ తాగండి అని కూడా సలహాలు ఇస్తుంటారు.

Lemon Water: చాలామంది ఉదయం లేవగానే నీళ్లలో నిమ్మకాయ రసం కలుపుకుని తాగేస్తూ ఉంటారు. వాళ్లని ఎవరైనా అడిగితే ఆరోగ్యానికి చాలామంచిది. మీరూ తాగండి అని కూడా సలహాలు ఇస్తుంటారు. నిజంగా పరగడుపున నిమ్మకాయ నీళ్లు తాగితే శరీరానికి అంత ప్రయోజనమా? అంటే.. అవుననే డాక్టర్లు చెబుతున్నారు. పైగా శరీరాని హైడ్రేటెడ్‌గా ఉంచాలంటే ప్రతిరోజూ తాగాలని సలహా ఇస్తున్నారు.

సాధారణంగా నిమ్మకాయ నీళ్లలో కాస్త పంచదార వేసుకుని తాగుతుంటారు. కానీ పంచదార బదులు తేనె వేసుకుని తాగడం మంచిదంటున్నారు..డాక్టర్లు. నిమ్మకాయ రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దానివల్ల ఉదయాన్నే ఈ నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

ప్రయోజనాలెన్నో..

బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగాలి. ఇందులో ఉండే పెక్టిన్ ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ నిమ్మకాయ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా శరీరంలో పేరుకుపోయిన ఎటువంటి విషాన్ని అయినా ఇది తొలగిస్తుంది.

నెల రోజులు తాగితే..

నెల రోజుల పాటు నిమ్మకీయ నీళ్లు ఆపకుండా తాగడం వల్లే శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోయి టాక్సిస్ ఫ్రీ అవుతుంది. ఈ టాక్సిస్ అనేవి శరీరంలో ఎక్కువగా ఉంటే మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. అదే నిమ్మకాయ నీళ్లు నెల రోజుల పాటు తాగితే అవన్నీ తగ్గిపోతాయి. అంతేకాదు ముఖం కాంతివంతంగా మారుతుంది. అందం మరింత పెరుగుతుంది.

అదేవిధంగా నిమ్మరసంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నెల రోజుల పాటు తాగడం పొట్ట మొత్తం శుభ్రం అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories