Health Tips: షుగర్‌ పేషెంట్లకి నిమ్మకాయ అత్యవసరం.. ఎందుకంటే..?

Lemon is essential for diabetic patients
x

Health Tips: షుగర్‌ పేషెంట్లకి నిమ్మకాయ అత్యవసరం.. ఎందుకంటే..?

Highlights

Health Tips: షుగర్‌ పేషెంట్లకి నిమ్మకాయ అత్యవసరం.. ఎందుకంటే..?

Health Tips: ఇండియాతో పాటు ప్రపంచంలో మధుమేహ బాధితులు రోజు రోజుకి ఎక్కువవుతున్నారు. ఈ వ్యాధికి సరైన మందు లేదు. రక్తంలో చక్కెర శాతం ఎప్పుడు నియంత్రణలో ఉండాలి. అయితే దీనికోసం చాలా పద్దతులు ఉన్నాయి. వాటిలో ఒకటి నిమ్మకాయ ఉపయోగించడం. ఎందుకంటే నిమ్మకాయలో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇవి షుగర్‌ పేషెంట్లకి ప్రయోజనకరంగా ఉంటాయి. నిమ్మకాయతో మధుమేహాన్ని ఎలా నియంత్రించవచ్చో ఈ రోజు తెలుసుకుందాం.

నిమ్మకాయ లక్షణాలు

నిమ్మకాయలో విటమిన్-ఎ, విటమిన్ సి, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రొటీన్ల వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. నిమ్మకాయలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు లవణాలు ఉంటాయి. నిమ్మకాయ గ్లైసెమిక్ సూచిక చాలా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా నిపుణులు మధుమేహంలో ప్రయోజనకరంగా చెబుతారు.

చక్కెర స్థాయిని ఎలా తగ్గించాలి?

గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయి ఎక్కువైతే చక్కెర స్థాయి పెరుగుతుంది. కాబట్టి మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాలని తీసుకోవాలి. నిమ్మకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు మధుమేహాన్ని నియంత్రిస్తాయి.

నిమ్మకాయ ఎలా తీసుకోవాలి..?

భోజనానికి గంట ముందు ఒక గ్లాసు నిమ్మరసం తాగితే బరువు అదుపులో ఉంటుంది. ఒకవేళ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకంటే తర్వాత నిమ్మరసం తీసుకోవాలి. అప్పుడు షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది. మీరు సలాడ్‌లో నిమ్మకాయను తీసుకోవచ్చు. ఆహారంలో కూడా ఉపయోగించవచ్చు. నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎప్పుడు చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories