Tea Effect: టీ బాగా ఇష్టపడితే కొంచెం కష్టమైన విషయాలు కూడా భరించాల్సిందే..!

Learn About the Dangers of Drinking tea Every day
x

Tea Effect: టీ బాగా ఇష్టపడితే కొంచెం కష్టమైన విషయాలు కూడా భరించాల్సిందే..!

Highlights

Tea Effect: ఇప్పుడున్న పరిస్థితులలో చాలామందికి టీ తాగనిదే రోజు గడవదు. అసలు వారి రోజు మొదలయ్యేదే టీ తో అని చెప్పవచ్చు.

Tea Effect: ఇప్పుడున్న పరిస్థితులలో చాలామందికి టీ తాగనిదే రోజు గడవదు. అసలు వారి రోజు మొదలయ్యేదే టీ తో అని చెప్పవచ్చు. గ్రామాల నుంచి మొదలుకొని పట్టణాల వరకు పదిమంది కలిసే ఏ చోటైనా టీ సెంటర్ ఉంటుంది. కార్యాలయాల నుంచి కమిషనర్ ఆఫీస్ వరకు టీ తప్పనిసరి. అయితే ఏదైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే అతి చేస్తేనే హానికరం. టీ నెమ్మదిగా అలవాటై రోజు పదిసార్లు తాగేవారు ఉన్నారు. దీంతో వారి పరిస్థితి దారుణంగా మారింది. టీ గురించి కొన్ని మంచి చెడులను ప్రస్తావించుకుందాం.

వాస్తవానికి శరీరానికి రాత్రంతా నీరు అందదు దాని వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది ఈ పరిస్థితిలో ఉదయాన్నే లేచి మొదట నీరు తాగాలి. ఆ తర్వాత టీ తాగితే దాని నష్టం కొంతవరకైనా తగ్గుతుంది. బాగా మరిగించిన టీని ఎక్కువగా తాగడం వల్ల అందులో నికోటినామైడ్ పరిమాణం పెరుగుతుంది ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగకూడదు. ఇది స్లో పాయిజన్ కంటే తక్కువేమి కాదు. వీలైనంత వరకు తాజా టీ మాత్రమే తాగాలి. టీ తర్వాత 3 నుంచి 4 గంటల విరామం తర్వాత మాత్రమే భోజనం చేయాలి.

ఎక్కువ టీ తాగడం గుండెకు మంచిది కాదు. మీరు ఏదైనా వ్యాధికి మందులు వాడుతుంటే టీ తాగడం మానుకోండి.పేగులపై టీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్దకానికి దారి తీస్తుంది. కొందరికి ఉదయాన్నే టీ తాగకుంటే ప్రెష్‌గా ఉండదు. కానీ ఈ అలవాటు హానికరం. నిత్యం టీ తాగడం వల్ల ఎముకలు పెళుసుగా మారడం, రక్తనాళాలు కుంచించుకుపోవడం, రక్తపోటు పెరగడం, అసిడోసిస్ పెరగడం జరుగుతుంది. టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం కూడా పెరుగుతుంది. అలాగే టీని నిరంతరం తాగడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories