Smile Benefits: నవ్వు నాలుగు విధాల చేటు కాదు.. ఆక్సిజన్ అందించే అమృతం..

Laughing Therapy has Many Benefits for the Body | Life Style
x

Smile Benfits: నవ్వు నాలుగు విధాల చేటు కాదు.. ఆక్సిజన్ అందించే అమృతం..

Highlights

Smile Benfits: జీవితంలో చాలా సమస్యలకు ఒక చిరునవ్వు సమాధానం చెబుతుంది...

Smile Benefits: జీవితంలో చాలా సమస్యలకు ఒక చిరునవ్వు సమాధానం చెబుతుంది. నవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు నవ్వే వ్యక్తులు ఉల్లాసంగా ఉంటారు. నవ్వడం నాలుగు విధాలుగా చేటు అంటారు.. కానీ ఇది నిజం కాదు. నవ్వు ఆక్సిజన్ అందించే అమృతం. మనస్ఫూర్తిగా నవ్వితే శరీరంలో ఉన్న రోగాలన్ని మాయమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలా మంది లాఫింగ్ థెరపీ తీసుకుంటారు. మానసికంగా ఉపశమనం పొందుతారు. నవ్వు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. నవ్వు శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్‌ ఒత్తిడిని తగ్గించి.. మానసిక స్థితిని రిఫ్రెష్ చేస్తుంది. మనిషి ఆనందంగా ఉండే విధంగా చేస్తుంది.

2. శరీరంలో శ్వాస వ్యాయామం చేయడానికి నవ్వు ఒక మార్గం. ఇది మన శరీరానికి ఆక్సిజన్‌ను అందిస్తుంది. రోజంతా మనల్ని శక్తివంతంగా ఉంచుతుంది.

3. నవ్వు నొప్పిని కూడా తగ్గిస్తుంది. లాఫింగ్ థెరపీ వల్ల నొప్పిని తగ్గించవచ్చు. మీరు 10 నిమిషాలు చిరునవ్వుతో ఉంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

4. నవ్వని వారితో పోలిస్తే నవ్వే వారిలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. కనుక ఎప్పుడూ బహిరంగంగా నవ్వడం అలవాటు చేసుకోవాలి. ముఖంపై చిరునవ్వు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

5. నవ్వు వ్యాధులపై పోరాడే శక్తిని పెంచుతుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రతిరోజు నవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories