Grapes vs Raisins: ఆరోగ్యానికి ద్రాక్ష మంచిదా ఎండుద్రాక్ష మంచిదా..!

Know Whether Grapes Are Good For Health Or Raisins Which Is More Beneficial
x

Grapes vs Raisins: ఆరోగ్యానికి ద్రాక్ష మంచిదా ఎండుద్రాక్ష మంచిదా..!

Highlights

Grapes vs Raisins: ప్రతిరోజు పండ్లు, డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలామంచిది.

Grapes vs Raisins: ప్రతిరోజు పండ్లు, డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలామంచిది. ఈ రోజు ద్రాక్ష, ఎండుద్రాక్ష గురించి తెలుసుకుందాం. ద్రాక్ష పుల్లని, తీపి రుచి చాలా మందిని ఆకర్షిస్తుంది. అయితే ఎండుద్రాక్షని ఎండబెట్టడం ద్వారా తయారు చేస్తారు. దీనిని కూడా చాలామంది ఇష్టపడుతారు. ఎక్కువగా స్వీట్లు, తీపి వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. ద్రాక్షలో 80 శాతం నీరు ఉంటుంది. ఎండుద్రాక్షలో నీటి శాతం 15 శాతం మాత్రమే ఉంటుంది. అయితే ఈ రెండింటిలో ఏది మంచిదో ఈరోజు తెలుసుకుందాం.

ఎండుద్రాక్ష vs ద్రాక్ష

ద్రాక్ష, ఎండుద్రాక్ష రెండూ ఆరోగ్యానికి మంచివే. అయితే ద్రాక్షతో పోలిస్తే ఎండుద్రాక్షలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. ఎండుద్రాక్షను ఎండబెట్టిన తయారుచేస్తారు. ఈ ప్రక్రియలో చక్కెర, యాంటీఆక్సిడెంట్లు కేలరీల రూపంలోకి మారుతాయి. అరకప్పు ద్రాక్ష పండ్లను తింటే 30 క్యాలరీలు మాత్రమే అందుతాయి. అదే ఎండు ద్రాక్షను తింటే శరీరానికి 250 కేలరీలు అందుతాయి.

ఎండుద్రాక్ష ప్రయోజనాలు

ఎండు ద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఐరన్‌, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇది పేగులోని బ్యాక్టీరియాను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది.

ద్రాక్ష తినడం వల్ల ప్రయోజనాలు

ద్రాక్షలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పోషకాలు చర్మ కణాలను యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. దీంతోపాటు చర్మాన్ని క్యాన్సర్‌కు గురిచేసే కిరణాల నుంచి కాపాడుతాయి. ద్రాక్షను తీసుకుంటే ముఖంపై ఉండే నల్ల మచ్చలు ముడతలు తగ్గుతాయి.

ద్రాక్షలో ఏది మంచిది..?

రెండు రకాల ద్రాక్షలు ఆరోగ్యానికి మంచివే. అయితే ద్రాక్షలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఎప్పుడైనా తక్కువ కేలరీలు ఉన్న ఆహారం ఆరోగ్యానికి మంచి చేస్తుంది. కాబట్టి పచ్చి ద్రాక్షని తినడానికి ప్రయత్నించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories