సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టాలంటే..ఈ సీజన్‎లో ఈ పండు తింటే చాలు..!

Kiwi Fruit Benefits in Monsoon Health Tips
x

సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టాలంటే..ఈ సీజన్‎లో ఈ పండు తింటే చాలు..!

Highlights

Kiwi In Monsoon: వర్షాకాలంలో వ్యాధుల భయం ఎక్కువగా ఉంటుంది.

Kiwi In Monsoon: వర్షాకాలంలో వ్యాధుల భయం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు దోమల వల్ల వ్యాపిస్తుండగా, కలుషిత ఆహారం, నీటి ద్వారా టైఫాయిడ్ వంటి అంటువ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు వీటి బారిన పడే అవకాశాలు ఎక్కువ. అందుకే వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు

ఈ సీజన్‌లో శుభ్రమైన, పోషకాహారం తీసుకోవాలి. తినే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. దోమల పెరుగుదల నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్థాలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా కివీ పండ్లు వర్షాకాలంలో చాలా ఉపయోగపడతాయి.

కివీ పండ్లలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు

కివీ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి విటమిన్ సి అధికంగా కలిగి ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరిస్తాయి. ఆరెంజ్ కన్నా ఎక్కువ విటమిన్ సి కివీ పండ్లలో ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది.

అంతేకాదు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, జ్వరం, డెంగీ నుంచి త్వరగా కోలుకునేందుకు సాయపడుతుంది. డెంగీ జ్వరం వచ్చినవారు కివీ పండ్లు తింటే రక్తంలోని ప్లేట్‌లెట్స్ సంఖ్యను పెంచుకోవచ్చు. ఇందులోని విటమిన్ సి, మనం తినే ఆహారంలోని ఐరన్ శరీరానికి అందేలా చేస్తుంది.

చర్మ ఆరోగ్యానికి కూడా మేలు

వర్షాకాలంలో వాతావరణ తేమ కారణంగా చర్మ సమస్యలు, ఫంగస్, వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. కివీ పండ్లలో ఉండే విటమిన్ సి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది.

డయాబెటిస్ పేషెంట్లకు కూడా అనుకూలం

షుగర్ పేషెంట్లు కూడా కివీ పండ్లను నియమితంగా తీసుకుంటే, రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా వినియోగించుకునేలా చేస్తుంది.

ఈ వర్షాకాలంలో కివీ పండ్లను ఆహారంలో చేర్చడం ద్వారా ఆరోగ్య రక్షణతో పాటు, ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టి, శక్తివంతమైన రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ కివీని తినడం మంచిదే.

Show Full Article
Print Article
Next Story
More Stories