Top
logo

చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడండి.. ఈ ప్రాబ్లం ఉండదు

చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడండి.. ఈ ప్రాబ్లం ఉండదు
X
Highlights

టీ, కాఫీలలో మనం ఎక్కువగా చక్కెరను వాడుతుంటాం. అయితే చక్కెర ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు...

టీ, కాఫీలలో మనం ఎక్కువగా చక్కెరను వాడుతుంటాం. అయితే చక్కెర ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. చక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగించడం ఉత్తమమని సూచిస్తున్నారు. బెల్లం అనేక రకాలుగా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై అత్యధిక ప్రభావం చూపుతుంది. ప్రతి రోజూ భోజనం చేసిన తర్వాత బెల్లం తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

మన శ్వాసవ్వవస్థ సరిగా జరగడంలో కూడా ఇది తోడ్పడుతుంది. శ్వాసనాళాలు, రక్తనాళాలు శుద్దికి బెల్లం ఖచ్చితంగా తినాలి. రక్త ప్రసరణ కూడా బాగా మెరుగవుతుంది. దగ్గు, జలుబును బెల్లం సులభంగా దూరం చేయగలదు. అయితే బెల్లం వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. శరీరంలోని మలినాలను బయటకు వెళ్లేలా తోడ్పడుతుంది. ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా బెల్లంలో కార్బోహైడ్రేట్స్ విరివిగా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి ఇన్‌స్టాంట్ ఎనర్జీ లభిస్తుంది.

కావాల్సిన దాని కంటే ఎక్కువగా తిని ఇబ్బంది పడుతున్న సమయంలో బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే కాస్త ఉపశమనం దొరుకుతుంది. ఐరన్ లోపంతో బాధపడుతున్న వారు బెల్లం తింటే మంచిది. రక్తాన్ని ఉత్పత్తి చేయడంలో బెల్లం సహకారం ఎంతగానో ఉంటుంది. బెల్లం తింటే ముఖంపై మచ్చలు, మొటిమలు కూడా తగ్గుపోతాయి. చర్మానికి మంచి నిగారింపు కూడా వస్తుంది. డరుతుక్రమ సమస్యలతో బాధపడే మహిళలకు ఇది మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.

Next Story